అమరావతి మళ్లీ ఊపిరి పోసుకుంటుంది... 2022లో చేసిన ట్వీట్ ను రీపోస్ట్ చేసిన చంద్రబాబు
- నేడు అమరావతి పనులు పునఃప్రారంభం
- పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ
- జరగాలని ఉంటే జరిగి తీరుతుందంటూ చంద్రబాబు ట్వీట్
ఏపీ రాజధాని అమరావతి పునర్ నిర్మాణ పనులకు నేడు శ్రీకారం చుట్టారు. సీఎం చంద్రబాబు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ అమరావతి పనుల పూజా కార్యాక్రమాల్లో పాల్గొన్నారు. దీనిపై సీఎం చంద్రబాబు ఆసక్తికర ట్వీట్ చేశారు. గతంలో తాను చేసిన ట్వీట్ ను ఆయన ఇవాళ రీపోస్ట్ చేశారు.
"ఆంధ్రుల రాజధాని అమరావతే... అమరావతి మళ్లీ ఊపిరి పోసుకుంటుంది... అమరావతే గెలుస్తుంది... ఇదే ఫైనల్" అంటూ చంద్రబాబు 2022 అక్టోబరు 22న ట్వీట్ చేశారు. ఇవాళ ఆ ట్వీట్ ను మరోసారి పంచుకున్న చంద్రబాబు ఆసక్తికరంగా స్పందించారు.
"ఏది ఎలా జరగాలని ఉంటే అది జరిగి తీరుతుంది... ఐదేళ్లపాటు నిర్లక్ష్యం చేసినా, ఆశలను తుంచివేసినా... ఇవాళ అమరావళి మళ్లీ నిలబడింది. ఇటుక మీద ఇటుకతో, ఒకరికొకరు అండగా... ప్రజా రాజధాని పునర్ నిర్మాణం జరుపుకుంటోంది.
ఇవాళ మన రాజధాని కలను మళ్లీ సాకారం చేసుకుంటున్న శుభతరుణంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభాభినందనలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా, దమనకాండకు ఎదురొడ్డి నిలిచి, తమ ఉద్యమం ద్వారా రాజధాని కలను సజీవంగా నిలిపిన రైతులు, మహిళలకు అభినందనలు" అంటూ చంద్రబాబు తన ట్వీట్ లో పేర్కొన్నారు.