దేశ ఐక్యతను స్టాలిన్, ఉదయనిధి నాశనం చేస్తున్నారు: నారాయణన్ తిరుపతి
- టీఎన్ గవర్నర్ రవి 'ద్రవిడ' అనే పదాన్ని పలకలేదని స్టాలిన్ విమర్శ
- గవర్నర్ ను తొలగించాలని డిమాండ్
- దేశాన్ని విడదీయాలని 50 ఏళ్లుగా ప్రయత్నిస్తున్నారని నారాయణన్ మండిపాటు
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్, ఆయన కుమారుడు, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ పై ఆ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు నారాయణన్ తిరుపతి తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశ ఐక్యతను వీరిద్దరూ నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. వీరంతా (డీఎంకే) దేశాన్ని కులం, మతం, ప్రాంతం ఆధారంగా విభజించాలని 50 ఏళ్లుగా ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్రగీతంలోని 'ద్రవిడ' అనే పదాన్ని రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి పలకకుండా దాటవేశారని స్టాలిన్ ఆరోపించారు. జాతీయగీతంలోనూ ద్రవిడ అనే పదాన్ని పలకకుండా ఉండే దమ్ము గవర్నర్ కు ఉందా? అని ప్రశ్నించారు. గవర్నర్ ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే స్టాలిన్ పై నారయణన్ విమర్శలు గుప్పించారు.