అమరావతి పనుల పునఃప్రారంభం.. విశాఖను ఆర్థిక రాజధానిగా చేస్తామన్న సీఎం చంద్రబాబు
- సీఆర్‌డీఏ కార్యాలయం పనుల ద్వారా రాజధాని నిర్మాణం పునఃప్రారంభం
- భవన ప్రాంగణంలో మంత్రి నారాయణతో కలిసి చంద్రబాబు పూజా కార్యక్రమం
- 2017లో రూ.160 కోట్లతో సీఆర్డీఏ ఆఫీస్ నిర్మాణాన్ని ప్రారంభించిన ప్రభుత్వం
- ఈ నెల 16న జరిగిన సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో పనుల ప్రారంభంపై ప్రభుత్వం నిర్ణయం
రాజధాని అమరావతి నిర్మాణ పనులను సీఎం చంద్రబాబు పునఃప్రారంభించారు. తుళ్లూరు మండలం లింగాయపాలెం-ఉద్దండరాయునిపాలెం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. భవన ప్రాంగణంలో మంత్రి నారాయణతో కలిసి చంద్రబాబు పూజా కార్యక్రమం నిర్వహించారు.
సీఆర్‌డీఏ కార్యాలయం పనుల ద్వారా రాజధాని నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం పునఃప్రారంభించింది. రూ.160 కోట్లతో నాడు ఏడు అంతస్తుల్లో కార్యాలయ పనులను సీఆర్డీఏ చేపట్టింది. ఈ నెల 16న జరిగిన సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో పనుల ప్రారంభంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
సీఆర్డీఏ ప్రాజెక్ట్ ఆఫీస్ నిర్మాణాన్ని 2017లో ప్రారంభించింది. మొత్తం 3.62 ఎకరాల విస్తీర్ణంలో జీ ప్లస్ 7 భవనాన్ని 2,42,481 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనుంది.
భవనం నిర్మాణం కోసం ఇప్పటివరకూ రూ.61.48 కోట్ల ఖర్చుపెట్టింది. ఆర్కిటెక్చరల్ ఫినిషింగ్స్, ఇంటీరియర్స్, ఎలక్ట్రికల్, మెకానికల్ సిస్టమ్స్, ఇతర వర్క్స్ ఇంకా పూర్తి కావాల్సి ఉన్నాయి. బ్యాలెన్స్ పనుల పూర్తికి రూ.160 కోట్లు ఖర్చు అవుతుందని సీఎం తెలిపారు. నాలుగు నెలల్లో పనులు పూర్తి చేస్తామని అన్నారు.
రాష్ట్రానికి మధ్యలో ఉండే ప్రాంతం అమరావతి అని చంద్రబాబు అన్నారు. ఒక రాష్ట్రం.. ఒకే రాజధాని అని మరోసారి సీఎం తెలిపారు. ఇక వైజాగ్‌ను ఆర్థిక రాజధానిగా చేస్తామన్నారు. అలాగే కర్నూల్‌లో హైకోర్టు బెంచ్, పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని చంద్రబాబు చెప్పుకొచ్చారు.