గ‌డ్డంలేని బాయ్‌ఫ్రెండ్స్ కావాలి.. కాలేజీ యువ‌తుల వినూత్న ర్యాలీ.. నెట్టింట వీడియో వైర‌ల్‌!

  • ఇండోర్‌లో కాలేజీ గ‌ర్ల్స్ వినూత్న ర్యాలీ
  • ప్రేమ‌ కావాలంటే గ‌డ్డం వ‌ద్దంటూ ర్యాలీ చేప‌ట్టిన యువ‌తులు
  • నో క్లీన్ షేవ్.. నో ల‌వ్ అంటున్న యువ‌తులు
  • త‌మ‌దైన శైలిలో స్పందిస్తున్న నెటిజ‌న్లు
ప్ర‌స్తుతం యువ‌త ఫ్యాష‌న్ విష‌యంలో కొత్త పుంత‌లు తొక్కుతున్నారు. ట్రెండీ లుక్స్ కోసం ప‌రిత‌పిస్తున్నారు. మారుతున్న‌ కాలానుగుణంగా యువ‌త‌లో ఫ్యాష‌న్ అభిరుచులు మారుతున్నాయి. అబ్బాయిల్లో కొంద‌రు గ‌డ్డం పెంచి ఫ్యాష‌న్‌గా క‌నిపిస్తుంటే, మ‌రికొంద‌రు క్లీన్ షేవ్‌లో క‌నిపించేందుకు ఆస‌క్తి చూపుతున్నారు. ఇక అమ్మాయిల్లో కొంద‌రు క్లీన్ షేవ్‌లో ఉండే అబ్బాయిల‌ను ఇష్ట‌ప‌డితే, మ‌రికొంద‌రు గ‌డ్డంతో ట్రెండీగా ఉండే అబ్బాయిల‌ను కోరుకుంటారు. 

ఇంత‌వ‌ర‌కు బాగానే ఉన్నా.. ఇండోర్‌లో కొంద‌రు కాలేజీ యువ‌తులు అబ్బాయిల గ‌డ్డం విష‌య‌మై ర్యాలీ తీయ‌డం ఇప్పుడు అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది. మాకు గ‌డ్డంలేని బాయ్‌ఫ్రెండ్స్ కావాలంటూ యువ‌తులు ఈ వినూత్న ర్యాలీకి శ్రీకారం చుట్టారు. 'గ‌డ్డం తొలిగించండి.. ప్రేమ‌ను కాపాడండి' అనే నినాదంతో యువ‌తులు ముఖాల‌కు గ‌డ్డం మేక‌ప్‌తో ర్యాలీ నిర్వ‌హించారు. 

ఇక వారి చేతిలో ఉన్న ప్ల‌కార్డుల‌పై 'నో క్లీన్ షేవ్.. నో ల‌వ్‌', 'మాకు గ‌డ్డంలేని బాయ్‌ఫ్రెండ్స్ కావాలి', 'నో క్లీన్ షేవ్‌.. నో గ‌ర్ల్‌ఫ్రెండ్' వంటి లైన్స్ క‌నిపించాయి. ఇక‌ ఈ ర్యాలీ తాలూకు వీడియోను ఓ 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌) యూజ‌ర్ నెట్టింట పోస్ట్ చేశారు. దాంతో ఇప్పుడీ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. దీనిపై నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో స్పందిస్తున్నారు.

"వారి డిమాండ్ క‌రెక్టే. వారానికి ఒక‌సారైనా క్లీన్ షేవ్ కాకున్నా క‌నీసం ట్రీమ్ చేసుకుంటే బాగుంటుంది. అప్పుడే మ‌నం ఎలుగుబంటిలా కాకుండా జెంటిల్‌మెన్‌లా క‌నిపిస్తాం" అని ఒక‌రు కామెంట్ చేశారు.

"మా బాడీ మా ఇష్టం. వీళ్లు చాలా ఎక్కువ చేస్తున్నారు. ముందు విక్కీ కౌశ‌ల్ బాడీ స్ప్రే యాడ్‌లో ప‌నికిమాలిన‌ గుబురు గ‌డ్డంతో క‌నిపించ‌డ‌మే వీరి ఈ ఆలోచ‌న‌కు కార‌ణమైంద‌ని అనుకుంటున్నాను. ముందు అత‌డికి చెప్పాలి" అని మ‌రొక‌రు ఫ‌న్నీగా కామెంట్ చేశారు. "వారి గ‌డ్డం.. వారి ఇష్టం. మ‌ధ్య‌లో మీకెందుకు" అని ఇంకొక‌రు కామెంట్ చేశారు. 


More Telugu News