చిరంజీవి, బాలకృష్ణ మల్టీ స్టారర్ పై బోయపాటి శ్రీను ఆసక్తికర వ్యాఖ్యలు

  • బాలయ్యతో కలిసి సినిమా చేయాలనుందని ఇటీవల చెప్పిన చిరంజీవి
  • సినిమా తీయాలని బోయపాటికి సవాల్
  • వారిద్దరి కోసం కథ రాయకపోతే వేస్ట్ అన్న బోయపాటి
బాలకృష్ణతో కలిసి సినిమా చేయాలనుందని చిరంజీవి ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. నటుడిగా బాలయ్య 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తమ ఇద్దరినీ పెట్టి సినిమా తీయాలని దర్శకుడు బోయపాటికి కూడా చిరంజీవి సవాల్ విసిరారు. 

ఈ అంశంపై తాజాగా బోయపాటి శ్రీను ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరు, బాలయ్యలని ఎదురుగా పెట్టుకుని వారి కోసం కథ రాయకపోతే వేస్ట్ అని ఆయన అన్నారు. ఆ సినిమాకు టైటిల్ కూడా 'వారిద్దరే'నని చెప్పారు. బోయపాటి వ్యాఖ్యలు చూస్తుంటే... సెన్సేషనల్ కాంబినేషన్ లో సినిమా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నారు. ఈ చిత్రం కోసం మెగా, నందమూరి ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు.


More Telugu News