ఢిల్లీ లిక్కర్ కేసులో ఈరోజు కోర్టు విచారణకు హాజరవుతున్న కవిత

  • కేసును విచారించనున్న జడ్జి కావేరి బవేజా
  • ఇప్పటికే బెయిల్ పై ఉన్న కవిత
  • కోర్టు విచారణకు వర్చువల్ గా హాజరుకానున్న కవిత, ఇతర నిందితులు
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసును ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఈరోజు విచారించబోతోంది. సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ పై న్యాయమూర్తి కావేరి బవేజా విచారణ జరపనున్నారు. కోర్టు విచారణకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, ఇతర నిందితులు వర్చువల్ గా హాజరుకానున్నారు. 

గత విచారణ సందర్భంగా, సీబీఐ అందజేసిన ఛార్జ్ షీట్ కాపీల్లో చాలా పేజీలు బ్లాంక్ గా ఉన్నాయని కవిత తరపు న్యాయవాది మోహిత్ రావు కోర్టుకు తెలిపారు. దీంతో, సరైన కాపీలను అందజేయాలని సీబీఐని కోర్టు ఆదేశించారు. ఈ క్రమంలో, ఈరోజు ఈ కేసును రౌస్ అవెన్యూ కోర్టు విచారించబోతోంది. కవిత, కేజ్రీవాల్, మనీశ్ సిసోడియా తదితరులకు కోర్టు ఇప్పటికే బెయిల్ మంజూరు చేసింది. జైలు నుంచి బెయిల్ పై బయటకు వచ్చిన కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు.


More Telugu News