హైదరాబాద్‌లో రౌడీ షీటర్‌కు ఈడీ బిగ్ షాక్ .. ఆస్తుల జప్తు

  • హైదరాబాద్‌లో రౌడీ షీటర్‌పై మనీలాండరింగ్ కేసు నమోదు
  • రౌడీ షీటర్ భార్య పేరున ఉన్న రూ.1.01 కోట్ల ఆస్తుల జప్తు
  • నేర కార్యకలాపాలతో వచ్చిన డబ్బుతో స్థిరాస్తుల కొనుగోలు
హైదరాబాద్‌లో ఓ రౌడీ షీటర్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు. తొలిసారిగా ఒక రౌడీ షీటర్ కు చెందిన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ఎటువంటి ఆదాయ వనరులు లేకపోయినప్పటికీ కేవలం నేర కార్యకలాపాలు, బెదిరింపులతో వచ్చిన డబ్బులతో సమకూర్చుకున్న ఆస్తులుగా ఈడీ గుర్తించి సీజ్ చేసింది. ఈ మేరకు ఈడీ అధికారులు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.  
 
వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ హబీబ్‌నగర్ పోలీస్ స్టేషన్ రికార్డుల్లో రౌడీ షీటర్‌గా నమోదైన మహ్మద్ కైసర్ పై రాష్ట్రంలోని అనేక పోలీస్ స్టేషన్‌లో కేసులు ఉన్నాయి. హత్యలు, హత్యాయత్నాలు, జూదం, భూ కబ్జాలకు పాల్పడినట్లు అతనిపై అభియోగాలు ఉన్నాయి. అతను పీడీ యాక్ట్ కింద అరెస్టు అయి జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. అతను నేర కార్యకలాపాలతో సంపాదించిన డబ్బుతో భార్య షాహెదా బేగం పేరు మీద 2007 నుండి 2020 మధ్య పెద్ద ఎత్తున స్థిరాస్తులు కొనుగోలు చేశాడు. 

వీటన్నింటికీ నగదు రూపంలోనే చెల్లింపులు చేసినట్లు ఈడీ గుర్తించింది. ఇలా నిధుల మళ్లింపునకు సంబంధించి ఈడీ మరో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది. పెద్ద మొత్తంలో స్థిరాస్తులను కూడబెట్టినట్లు గుర్తించి వాటిని జప్తు చేసింది. వీటి విలువ అధికారికంగానే రూ.1.01 కోట్లు ఉండగా, అనధికారికంగా దానికి ఎన్నో రెట్లు ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. 


More Telugu News