చుట్టుముట్టిన సింహాల గుంపు.. దూడను రక్షించుకునేందుకు గేదె ఉగ్రరూపం.. వీడియో ఇదిగో!
- అడవిలో తల్లితో కలిసి వెళుతున్న దూడపై సింహాల గుంపు ఎటాక్
- దూడను నోట కరుచుకుని ఎత్తుకెళ్లిన సింహం
- ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చిన గేదె
- మృగరాజుల నుంచి దూడను రక్షించి తీసుకెళ్లిన వైనం
పిల్లల జోలికి వస్తే అటుపక్క ఉన్నది ఎవరైనా సరే తల్లి తాట తీస్తుందని చెప్పేందుకు ఇదో ఉదాహరణ. చుట్టుముట్టిన సింహాల గుంపుతో వీరోచితంగా పోరాడిన ఓ గేదె తన దూడను రక్షించుకుంది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. కామెంట్లతో నెటిజన్లు హోరెత్తిస్తున్నారు.
సాధారణంగా అడవిలో సింహాలను చూసిన ఏ జంతువైనా బిక్కచచ్చిపోతుంది. ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పరుగులు పెడుతుంది. అయితే, ‘నేచర్ ఈజ్ బ్రూతల్’ ఎక్స్ ఖాతాలో పోస్టు చేసిన ఈ అరుదైన వీడియోలో మాత్రం సింహాలపాలిట గేదె యమరాజులా మారిపోయింది. తన దూడతో కలిసి వెళుతున్న గేదెను సింహాల గుంపు వెంబడించింది.
చివరికి ఓ సింహం ఆ దూడను నోట కరుచుకుని ఎత్తుకెళ్లింది. ఆ వెంటనే గేదె ఉగ్రరూపం దాల్చింది. సింహాలను వెంటబెట్టింది. తన దూడను ఎత్తుకెళ్లిన సింహంపైకి లంఘించింది. చివరికి దూడను రక్షించి వెంట తీసుకొచ్చింది. గేదె ఎదురు తిరగడంతో సింహాల గుంపు తోక ముడవక తప్పలేదు.
ఈ వీడియోపై సోషల్ మీడియా యూజర్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఎదురు తిరగనంత వరకే ఎవరి ఆటలైనా సాగుతాయని, ఒకసారి ఎదురు తిరిగితే సింహాల్లానే తోకముడవక తప్పదని కామెంట్ చేస్తున్నారు. తన సంతానాన్ని రక్షించుకునేందుకు ఏ తల్లి అయినా ఎంతకైనా తెగిస్తుందని మరొకరు రాసుకొచ్చారు.