బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు ప్రధాని మోదీ .. రష్యా టూర్ ఖరారు

  • మాస్కో అధ్యక్షతన ఈ నెల 22 నుంచి 24వరకూ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు
  • 16వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు మోదీని స్వయంగా ఆహ్వానించిన పుతిన్
  • 22 నుంచి 23వరకూ రష్యాలో మోదీ పర్యటించనున్నారని వెల్లడించిన విదేశీ వ్యవహారాల శాఖ
రష్యాలోని కజన్ వేదికగా ఈ నెల 22 నుంచి 24 వరకూ బ్రిక్స్ (బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా) 16వ శిఖరాగ్ర సదస్సు జరగనుంది. ఈ నేపథ్యంలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రష్యా టూర్ ఖరారైంది. మాస్కో అధ్యక్షతన మూడు రోజుల పాటు జరిగే ఈ శిఖరాగ్ర సదస్సుకు హాజరు కావాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ స్వయంగా ఫోన్ చేసి మోదీని ఆహ్వానించారు. ఈ క్రమంలో ఈ నెల 22 నుంచి 23 వరకూ మోదీ రష్యాలో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ బ్రిక్ సభ్య దేశాల అధినేతలతో ద్వైపాక్షిక చర్చలు నిర్వహిస్తారని పేర్కొంది. 


More Telugu News