ఆ 420 టీమ్ ను నడిపిందే సజ్జల: బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి

  • జగన్ కొత్త నాటకానికి తెరలేపాడన్న భానుప్రకాశ్ రెడ్డి
  • నాడు నియంతలా వ్యవహరించి ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై విమర్శలా? అని మండిపాటు 
  • కార్యకర్తలను రెచ్చగొట్టి టీడీపీ కార్యాలయంపై దాడికి పంపింది సజ్జల కాదా? అని ప్రశ్న
వైసీపీ అధినేత వైఎస్ జగన్, ఆ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. విజయవాడలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ కూటమి ప్రభుత్వం అయితే అవినీతి, అరాచకాలకు కేరాఫ్ అడ్రస్ వైసీపీ అని దుయ్యబట్టారు. జగన్ కొత్త నాటకానికి తెరలేపాడని ఫైర్ అయ్యారు. అధికారంలో ఉన్నంత కాలం నియంతలా వ్యవహరించి ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి అవినీతి పాలన అంటూ కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని భానుప్రకాశ్ రెడ్డి మండిపడ్డారు.

వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడొచ్చి నీతులు చెబుతుంటే జనం నమ్మరని అన్నారు. వైసీపీ కార్యకర్తలను రెచ్చగొట్టి టీడీపీ కార్యాలయంపై దాడి చేయించింది సజ్జల కాదా? అని ప్రశ్నించారు. ఆ 420 టీమ్ ను వెనకుండి నడిపించింది సజ్జలేనని అన్నారు. బోరుగడ్డ అనిల్ వ్యాఖ్యలను సజ్జల అప్పుడు ఎందుకు ఖండించలేదని ప్రశ్నించారు. ఇప్పుడు అతడిని అరెస్టు చేస్తుంటే గగ్గోలు పెడతారా? అని ప్రశ్నించారు. జగన్ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడితే చూస్తూ ఊరుకోమని భానుప్రకాశ్ రెడ్డి హెచ్చరించారు. 


More Telugu News