కోలుకున్న స్టాక్ మార్కెట్ సూచీలు... సెన్సెక్స్ 218 పాయింట్ల అప్

  • నిన్న నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్
  • నేడు కూడా అంతర్జాతీయంగా మిశ్రమ సరళి
  • నేటి ఉదయం ఆశాజనకంగా ట్రేడింగ్ ఆరంభం
  • మార్కెట్లో అదే ఒరవడి కొనసాగింపు 
నిన్న నష్టాలతో ముగిసిన భారత స్టాక్ మార్కెట్ సూచీలు నేడు కోలుకున్నాయి. సెన్సెక్స్ 218.14 పాయింట్ల వృద్ధి కనబర్చి, 81,224 వద్ద ముగిసింది. నిఫ్టీ 104.20 పాయింట్లు లాభపడి 24,854 వద్ద స్థిరపడింది. 

ఇన్ఫోసిస్, ఏషియన్ పెయింట్స్, నెస్లే ఇండియా, హిందూస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్, టెక్ మహీంద్రా, హెచ్ సీఎల్ టెక్, టైటాన్, మారుతి, ఐటీసీ, బజాజ్ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు నష్టాల బాటలో పయనించాయి. 

యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్, టాటా స్టీల్, ఎన్టీపీసీ, జేఎస్ డబ్ల్యూ స్టీల్, సన్ ఫార్మా, ఎస్ బీఐ, అదానీ పోర్ట్స్, టీసీఎస్, అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ షేర్లు మదుపరులకు లాభాలు అందించాయి. 

అంతర్జాతీయంగా మిశ్రమ సరళి నెలకొన్నప్పటికీ, భారత స్టాక్ మార్కెట్ సూచీలు నేడు ఆశాజనకంగా ట్రేడింగ్ ఆరంభించాయి. ముగింపు వరకు అదే ఒరవడిని కొనసాగించడం విశేషం.


More Telugu News