శ్రీవారి భ‌క్తుల‌కు శుభ‌వార్త చెప్పిన‌ టీటీడీ

  • స్వామివారి మెట్టు మార్గాన్ని తిరిగి తెరిచిన టీటీడీ
  • న‌డ‌క‌దారిన వెళ్లి భ‌క్తులు శ్రీవారిని ద‌ర్శించుకోవ‌చ్చ‌ని వెల్ల‌డి
  • వ‌ర్షాలు త‌గ్గ‌డంతో ఇవాళ‌ శ్రీవారి మెట్టు మార్గాన్ని తెరిచిన‌ టీటీడీ
తిరుమ‌ల శ్రీవారి భ‌క్తుల‌కు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) శుభ‌వార్త చెప్పింది. వాతావ‌ర‌ణ శాఖ వారు భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రించిన‌ నేప‌థ్యంలో స్వామివారి మెట్టు మార్గాన్ని గురువారం మూసివేసిన విష‌యం తెలిసిందే. అయితే, నేడు (శుక్ర‌వారం) ఈ మార్గాన్ని తిరిగి తెరిచిన‌ట్లు టీటీడీ వెల్ల‌డించింది. 

న‌డ‌క‌దారిన వెళ్లి భ‌క్తులు శ్రీవారిని ద‌ర్శించుకోవ‌చ్చ‌ని తెలిపింది. వ‌ర్షాలు త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో ఇవాళ‌ శ్రీవారి మెట్టు మార్గాన్ని టీటీడీ అధికారులు రీ-ఓపెన్ చేశారు. 

ఇక తిరుమ‌ల‌లో భ‌క్తుల ర‌ద్దీ కొన‌సాగుతోంది. ప్ర‌స్తుతం 26 కంపార్ట్‌మెంట్ల‌లో భ‌క్తులు వేచి ఉన్నారు. టోకెన్‌లేని భ‌క్తుల‌కు స‌ర్వ‌ద‌ర్శ‌నానికి 12 గంట‌ల స‌మ‌యం ప‌డుతోంది. కాగా, గురువారం స్వామివారిని 58,637 మంది భ‌క్తులు ద‌ర్శించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.69 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు వెల్ల‌డించారు. 


More Telugu News