ఫైనాన్సియర్ చేతిలో మోసపోయిన గౌతమి.. న్యాయం జరిగే వరకు పోరు ఆపేది లేదన్న నటి
- గౌతమికి చెందిన 150 ఎకరాల స్థలాన్ని అమ్మిపెడతానని రూ. 3.1 కోట్లు తీసుకున్న అళగప్పన్
- అళగప్పన్ బెయిలు పిటిషన్‌పై నిన్న విచారణ
- బెయిలు ఇవ్వొద్దని వాదించిన గౌతమి తరపు న్యాయవాది
తన భూమిని అమ్మిపెడతానని చెప్పి మోసం చేసిన కేసులో న్యాయం జరిగే వరకు పోరాడుతూనే ఉంటానని ప్రముఖ నటి గౌతమి పేర్కొన్నారు. ఈ కేసు విచారణలో భాగంగా నిన్న (గురువారం) కోర్టుకు హాజరైన ఆమె న్యాయమూర్తి ఎదుట వివరణ ఇచ్చారు. ఆమెను మోసం చేసిన సినీ ఫైనాన్సియర్ అళగప్పన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌పై నిన్న విచారణ జరిగింది. ఆయనకు బెయిలు ఇవ్వొద్దని గౌతమి తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. అనంతరం గౌతమి విలేకరులతో మాట్లాడుతూ తనకు న్యాయం జరిగే వరకు పోరాడుతూనే ఉంటానని, దీనిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
తమిళనాడులోని రామనాథపురం జిల్లా ముతుకులత్తూర్ సమీపంలో గౌతమికి 150 ఎకరాల స్థలం ఉంది. దీనిని అమ్మిపెడతానని కారైక్కుడికి చెందిన సినీ ఫైనాన్సియర్ అళగప్పన్ రూ. 3.1 కోట్లు తీసుకుని మోసం చేసినట్టు గౌతమి ఆరోపిస్తున్నారు. ఆయన నుంచి తన డబ్బులు తనకు ఇప్పించాలని కోరుతూ రామనాథపురం ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా నిన్న ఆమె కోర్టుకు హాజరయ్యారు.