మహిళల టీ20 ప్రపంచకప్: ఆస్ట్రేలియాకు ఊహించని షాక్.. ఫైనల్‌కి దూసుకెళ్లిన దక్షిణాఫ్రికా!
- తొలి సెమీస్‌లో సఫారీల చేతిలో ఓడిన ఆసీస్
- 8 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను మట్టికరిపించిన దక్షిణాఫ్రికా
- అజేయ అర్ధశతకంతో రాణించిన అన్నెకే బాష్ (74 నాటౌట్)
- ఆరుసార్లు చాంపియన్ అయిన ఆస్ట్రేలియాకు ఊహించని భంగపాటు
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాకు ఊహించని షాక్ తగిలింది. సెమీ ఫైనల్‌లో దక్షిణాఫ్రికా చేతిలో ఆసీస్ ఓటమి పాలైంది. దీంతో సఫారీలు ఫైనల్‌కి దూసుకెళ్లారు. ఆరుసార్లు చాంపియన్ అయిన కంగారూలను దక్షిణాఫ్రికా ఊహించని రీతిలో దెబ్బ కొట్టింది. దాంతో గత టీ20 వరల్డ్‌కప్ ఫైనల్‌లో ఓటమికి ఇప్పుడు సఫారీలు బదులు తీర్చుకున్నట్టయింది.
గురువారం జరిగిన తొలి సెమీస్‌లో దక్షిణాఫ్రికా ఏకంగా 8 వికెట్ల తేడాతో ఆసీస్‌ను మట్టికరిపించింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 135 పరుగుల లక్ష్యాన్ని ఇంకా 16 బంతులు మిగిలి ఉండగానే రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.
మొదట టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ ఆది నుంచే తడబడింది. మూడు ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి కేవలం 18 పరుగులు మాత్రమే చేసింది. అయితే, తహ్లియా మెక్‌గ్రాత్ (33 బంతుల్లో 27) మధ్యలో మూనీతో కలిసి మూడో వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యంతో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు.
కానీ, ఆమె పెవిలియన్ చేరిన తర్వాత ఆస్ట్రేలియా స్కోర్ బోర్డు ముందుకు కదలలేదు. బెత్ మూనీ 42 బంతుల్లో 44 పరుగులు చేసింది. నిర్ణీత 20 ఓవర్లకు ఆస్ట్రేలియా ఐదు వికెట్ల నష్టానికి 134 రన్స్ మాత్రమే చేసింది. సఫారీ బౌలర్లలో అయబొంగా ఖాకా (2/24) ఆసీస్ బ్యాటర్లను కట్టడి చేసింది.
ఆ తర్వాత 135 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా 17.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. ఆ జట్టు బ్యాటర్లలో అన్నెకే బాష్ (74 నాటౌట్), కెప్టెన్ లారా వోల్వార్డ్ 42 అద్భుత ఇన్నింగ్స్‌లతో టీమ్‌ను విజయతీరాలకు చేర్చారు.