రెండు భాగాలుగా మహేశ్-రాజమౌళి సినిమా?
- యాక్షన్ అడ్వెంచర్ మూవీగా మహేశ్ సినిమా
- వరుస సీక్వెల్స్‌గా తీసుకురావడానికి ప్లానింగ్
- విదేశీ భాషల్లోనూ విడుదలకు సన్నాహాలు
మహేశ్ బాబు-రాజమౌళి కాంబినేషన్‌లో త్వరలో ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. యాక్షన్ అడ్వెంచర్ మూవీగా తెరకెక్కనున్న ఈ చిత్రం గురించి ఎటువంటి అప్‌డేట్ వచ్చినా సెన్సేషన్ అవుతోంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన గెటప్, లుక్ కోసం మహేశ్ మేకోవర్‌లో వుండగా, దర్శకుడు రాజమౌళి మాత్రం కథపై కసరత్తులు చేస్తున్నాడు.
జనవరిలో ప్రారంభం కానున్న ఈ చిత్రం గురించి మరో వార్త వినిపిస్తోంది. మహేశ్-రాజమౌళి సినిమా రెండు భాగాలుగా రాబోతుందనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అమెజాన్ అడవుల నేపథ్యంలో కొనసాగే ఈ కథను ఒకే భాగంలో చెప్పడం సాధ్యమయ్యే విధంగా లేదని రాజమౌళి అండ్ ఆయన బృందం ఆలోచనలో వున్నట్లు సమాచారం. భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించి రూపొందిస్తున్న ఈ చిత్రం విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని చిత్ర యూనిట్ ముందే నిర్ణయం తీసుకుందట.
ఈ చిత్రంలో ఇండియన్ ఆర్టిస్టులతో పాటు విదేశీ నటీనటులను కూడా ఎంపిక చేస్తున్నారని తెలిసింది. అంతేకాదు ఇండియానా జోన్స్ మాదిరిగా ఈ చిత్రం సీక్వెల్‌లు ఒకదాని తరువాత మరొకటి వచ్చే అవకాశాలు కూడా వున్నాయని అంటున్నారు. విజయేంద్రపసాద్ కథను అందిస్తున్న ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ పతాకంపై కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. అన్ని భారతీయ భాషలతో పాటు విదేశీ భాషల్లోనూ ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలుస్తాయి.