డీవోపీటీ ఆదేశాలతో ఏపీలో రిపోర్టు చేసిన నలుగురు ఐఏఎస్ అధికారులు
- ఏపీకి కేటాయించినా ఇంకా తెలంగాణలోనే కొనసాగుతున్న ఐఏఎస్ లు
- ఏపీకి వెళ్లాలంటూ ఇటీవల డీవోపీటీ ఆదేశాలు
- క్యాట్ లోనూ, తెలంగాణ హైకోర్టులోనూ ఐఏఎస్ లకు నిరాశ
- నిన్న సాయంత్రం తెలంగాణ నుంచి రిలీవ్ అయిన అధికారులు
- నేడు ఏపీ సీఎస్ కు రిపోర్టు చేసిన రొనాల్డ్ రాస్, ఆమ్రపాలి, వాకాటి కరుణ, వాణీ ప్రసాద్
రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీకి కేటాయించినప్పటికీ, తెలంగాణలోనే విధులు నిర్వర్తిస్తున్న ఐఏఎస్ అధికారులు... డీవోపీటీ ఆదేశాల నేపథ్యంలో ఎట్టకేలకు నేడు ఏపీలో రిపోర్టు చేశారు. ఐఏఎస్ అధికారులు ఆమ్రపాలి కాటా, రొనాల్డ్ రాస్, వాకాటి కరుణ, వాణీ ప్రసాద్ ఏపీ సీఎస్ కు రిపోర్టు చేశారు.
ఈ నలుగురు ఐఏఎస్ అధికారులు తెలంగాణలోనే కొనసాగేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. క్యాట్ ను ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. తెలంగాణ హైకోర్టులోనూ వారికి చుక్కెదురైంది. దాంతో డీవోపీటీ ఆదేశాలను పాటించక తప్పలేదు. ఈ క్రమంలో నలుగురు ఐఏఎస్ అధికారులు నిన్న సాయంత్రం తెలంగాణ నుంచి రిలీవ్ అయ్యారు.