నూతన, అత్యుత్తమ విధానాలతో పెట్టుబడిదారులకు ఆహ్వానం పలుకుతున్నాం: సీఎం చంద్రబాబు
- హర్యానా సీఎంగా నాయబ్ సింగ్ సైనీ ప్రమాణ స్వీకారం
- హాజరైన ఏపీ సీఎం చంద్రబాబు
- పెట్టుబడిదారులకు సాదర స్వాగతం పలికిన వైనం
ఏపీ వచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రం ఇప్పుడు నూతన, అత్యుత్తమ విధానాలతో పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం పలుకుతోందని అన్నారు.
పారిశ్రామిక రంగంలో విశేష అనుభవం ఉన్నవారితో రాష్ట్ర పారిశ్రామిక విధానానికి రూపకల్పన చేశామని, ఏపీ ఇప్పుడు పూర్తిగా వ్యాపార, పారిశ్రామిక అనుకూల రాష్ట్రమని చంద్రబాబు స్పష్టం చేశారు. ఏపీలో పెట్టుబడులకు ఇంతకంటే మంచి తరుణం లేదని పిలుపునిచ్చారు.
ఇవాళ హర్యానా సీఎంగా నాయబ్ సింగ్ సైనీ ప్రమాణ స్వీకారోత్సవానికి చంద్రబాబు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ఏపీ పెట్టుబడిదారులకు స్వర్గధామంలా ఉందన్నారు. రాష్ట్రంలో కొత్త పెట్టుబడుల కోసం ఎదురుచూస్తున్నామని చెప్పారు. ఉత్తేజకరమైన అభివృద్ధి పథంలో తమతో సహకరించాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు.