చెన్నైలో భారీ వర్షాలు.. విలాసవంతమైన హోటళ్లకు మకాం మారుస్తున్న ధనవంతులు
- చెన్నైలో కుండపోత వర్షాలు
- ముందు జాగ్రత్తగా హోటళ్లకు క్యూకడుతున్న ధనవంతులు, ఐటీ నిపుణులు
- గతేడాది చివరలో భారీ వర్షాలు ముంచెత్తడంతో భీకర దృశ్యాలు
- ఈ నేపథ్యంలో చెన్నైవాసుల జాగ్రత్తలు
తమిళనాడు రాజధాని నగరం చెన్నైలో కుండపోత వర్షాలు కురుస్తుండడంతో అక్కడి ప్రజల్లో భయం నెలకొంది. గతం తాలూకు ఘటనల నేపథ్యంలో ప్రత్యేకించి ధనవంతులు, ఐటీ నిపుణులు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు ముందు జాగ్రత్తగా విలాసవంతమైన హోటళ్లకు మకాం మారుస్తున్నట్లు తెలుస్తోంది.
పెద్దపెద్ద హోటళ్లలో గదులు బుక్ చేసుకుని ఫ్యామిలీలతో కలిసి దిగిపోతున్నారట. గతేడాది చివరలో ఒక్కసారిగా భారీ వర్షాలు ముంచెత్తడంతో వరద నీటిలో వాహనాలు కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. అలాగే ఇళ్లు జలమయం అయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఈసారి అలా జరగకుండా ముందు జాగ్రత్తగా ధనవంతులు విలాసవంతమైన హోటళ్లలో దిగుతున్నట్లు సమాచారం.
వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేక వసతి, విద్యుత్, తాగునీరు, వైఫై తదితర సౌకర్యాలు ఉండేలా చూడాలనే షరతులతో గదుల్లో దిగుతున్నట్లు తెలుస్తోంది. బుధవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ రెడ్ అలర్ట్ ఇచ్చినా సాయంత్రం వరకు తేలికపాటి వర్షమే పడడంతో నగర ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఈరోజు చెన్నైకి భారీ నుంచి అతిభారీ వర్షసూచన చేసింది వాతావరణ శాఖ.
అటు బెంగళూరులోనూ కుంభవృష్టి కారణంగా జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. మైసూరు, మంగళూరు, కోలారు, చిత్రదుర్గ, చిక్కబళ్లాపురం, రామనగర, ఉడుపి తదితర జిల్లాల్లోనూ కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. నగరంలోని పలు లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు.