స్నేహితుడ్ని ఇరికించేందుకు విమానాలకు బాంబు బెదిరింపులు... మైనర్ బాలుడి నిర్వాకం
- ఓ వ్యాపార వేత్త కుమారుడు (17)కి నగదు విషయంలో స్నేహితుడితో గొడవ
- స్నేహితుడిని కేసులో ఇరికించేందుకు అతని పేరుతో ఎక్స్ ఖాతా సృష్టించిన బాలుడు
- ఆ ఎక్స్ ఖాతా నుంచి పలు విమానాలకు బెదిరింపు పోస్టులు
నగదు విషయంలో గొడవ పడిన ఓ స్నేహితుడిని కేసుల్లో ఇరికించేందుకు ఓ బాలుడు (మైనర్) చేసిన పన్నాగం బెడిసికొట్టింది. అతనే పోలీసులకు చిక్కాడు. ఇటీవల దేశ వ్యాప్తంగా విమానాలకు బాంబు బెదిరింపులు వస్తున్నాయి. గడిచిన 24 గంటల వ్యవధిలో తొమ్మిది విమానాలకు ఫేక్ బెదిరింపు కాల్స్ వచ్చాయి. ముంబయి నుండి బయలుదేరిన విమానాల ఘటనలకు సంబంధించి నమోదైన కేసులో ఓ మైనర్ బాలుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కే రామ్మోహన్ నాయుడు తెలిపారు.
అయితే పోలీసులు ఆ మైనర్‌ను విచారించగా, అతను చెప్పిన విషయాలకు ఆశ్చర్యపోయారు. ఓ వ్యాపారవేత్త కుమారుడు (17) సోషల్ మీడియాలో ఈ ఫేక్ పోస్టులు పెట్టినట్లుగా పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. నగదు విషయంలో గొడవ పడిన స్నేహితుడిని కేసులో ఇరికించేందుకు ఈ బాలుడు ఇదంతా చేసినట్లు తెలుస్తోంది. స్నేహితుడి పేరుతో ఎక్స్‌లో ఓ ఖాతాను సృష్టించి, పలు విమానాలకు బెదిరింపు పోస్టులు పెట్టాడని పోలీసుల ప్రాధమిక దర్యాప్తులో తేలింది. దీంతో ఆ బాలుడిని పోలీసులు అరెస్టు చేశారు.