కుమార్తెపై లైంగికదాడికి పాల్పడిన వ్యక్తికి బాంబే హైకోర్టు బెయిల్

  • కుమార్తెపై అత్యాచారం ఆరోపణలపై ఏడాదిగా జైలులో నిందితుడు
  • మాజీ భార్యతో ఆర్థిక పరమైన విభేదాలు ఈ ఆరోపణలకు కారణం కావొచ్చన్న న్యాయస్థానం
  • కేసులోని వైరుధ్యాలను ఎత్తి చూపిన కోర్టు
17 ఏళ్ల కుమార్తెపై లైంగిక దాడికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటూ ఏడాదిగా జైలులో ఉంటున్న వ్యక్తికి బాంబే హైకోర్టు బెయిలు మంజూరు చేసింది. బెయిలు ఇవ్వవద్దన్న ప్రాసిక్యూషన్ వాదనలను న్యాయస్థానం కొట్టిపడేసింది. మాజీ భార్యతో ఉన్న విభేదాల కారణంగా ఆయనపై ఈ ఆరోపణలు వచ్చి ఉంటాయని అభిప్రాయపడింది.

ఈ కేసులో భార్యాభర్తలు ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడిపోయారు. ఆ తర్వాత అతడు మరో వివాహం చేసుకున్నారు. అనంతరం మాజీ భార్యతో ఆర్థిక పరమైన విభేదాలు చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత ఆయనపై అత్యాచార కేసు నమోదైంది.

బెయిలు పిటిషన్‌పై వాదనల సందర్భంగా ప్రాసిక్యూషన్ తీవ్రంగా వ్యతిరేకించింది. అయితే, ప్రాసిక్యూషన్ వాదనను కోర్టు కొట్టేసింది. అత్యాచార ఆరోపణలు నిజమైతే 2023లో అతడు రెండో వివాహం చేసుకున్న తర్వాత బాధితురాలు తండ్రితో ఉండేది కాదంటూ పేర్కొంటూ కేసులోని వైరుధ్యాలను జస్టిస్ మనీశ్ పిటాలే ఎత్తిచూపారు. తల్లి అభిప్రాయాలతో విభేదించడం వల్లే ఆమె తండ్రి వద్దకు వచ్చిందని వివరించారు. విడాకుల ఒప్పందం ప్రకారం పురుషుడు తన కుమార్తెలు, మాజీ భార్యను ఆదుకోవాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు.  


More Telugu News