భారత్-న్యూజిలాండ్ తొలి టెస్ట్ షురూ.. టాస్ గెలిచిన టీమిండియా
బెంగళూరు వేదికగా భారత్- న్యూజిలాండ్ జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ షురూ అయింది. వర్షం కారణంగా నిన్న (బుధవారం) తొలి రోజు ఆట రద్దయినప్పటికీ.. ఇవాళ (గురువారం) వాతావరణం అనుకూలించడంతో టాస్ పడింది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ప్రత్యర్థి న్యూజిలాండ్‌కు బంతిని అందించాడు.
తుది జట్లు ఇవే..
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
న్యూజిలాండ్: టామ్ లాథమ్(కెప్టెన్), డెవోన్ కాన్వే, విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మాట్ హెన్రీ, టిమ్ సౌతీ, అజాజ్ పటేల్, విలియం ఒరూర్కే.
బ్యాటింగ్ ఎంచుకోవడంపై రోహిత్ శర్మ..
‘‘మొదట బ్యాటింగ్ చేయాలనుకుంటున్నాం. పిచ్ కవర్స్ కింద ఉంది. ఆరంభంలో బ్యాటింగ్ కాస్త ఇబ్బందికరంగా ఉండొచ్చు. అయితే పిచ్ స్వభావాన్ని బట్టి బోర్డుపై చక్కటి స్కోరు ఉంచగలిగితే కోరుకున్న ఫలితాన్ని సాధించవచ్చు. ఒక జట్టుగా ఏం చేయాలనేది నిర్ణయించుకున్నాం. ఇటీవల కొన్ని టెస్ట్ మ్యాచ్‌లలో బాగా ఆడాం. ప్రస్తుత మ్యాచ్‌లో రెండు మార్పులు ఉన్నాయి. శుభ్‌మాన్ గిల్ స్థానంలో సర్ఫరాజ్ వచ్చాడు. పేసర్ ఆకాశ్ స్థానంలో కుల్దీప్ యాదవ్‌ను జట్టులోకి తీసుకున్నాం’’ అని రోహిత్ శర్మ వివరించాడు. కాగా మెడ నొప్పి కారణంగా తొలి టెస్ట్ మ్యాచ్‌కు భారత యువ బ్యాటర్ శుభ్‌మాన్ గిల్ అందుబాటులో లేడని తెలిసింది.