రామ్‌చ‌ర‌ణ్ గొప్ప మ‌న‌సు.. ప్రాణాపాయంలో ఉన్న చిన్నారికి సాయం

  • పుట్టుక‌తోనే ప‌ల్మ‌న‌రీ హైప‌ర్‌టెన్ష‌న్‌తో బాధ‌ప‌డుతున్న చిన్నారి
  • 53 రోజుల పాటు అపోలో ఆసుప‌త్రిలో చికిత్స‌కు రామ్‌చ‌ర‌ణ్ సాయం
  • పాప కోలుకోవ‌డంతో బుధ‌వారం డిశ్చార్జి చేసిన వైద్యులు
గ్లోబ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ తేజ్ గొప్ప మ‌న‌సు చాటుకున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న చిన్నారి చికిత్స‌కు సాయం చేశారు. పుట్టుక‌తోనే ప‌ల్మ‌న‌రీ హైప‌ర్‌టెన్ష‌న్‌తో బాధ‌ప‌డుతూ ప్రాణాపాయంలో ఉన్న ఓ చిన్నారికి 53 రోజుల పాటు చికిత్స‌కు చెర్రీ సాయం అందించారు. 

హైద‌రాబాద్‌కు చెందిన ఓ ఫొటో జ‌ర్న‌లిస్టు దంప‌తుల‌కు ఆగ‌స్టు 22న చిన్నారి జ‌న్మించింది. అయితే, చిన్నారి గుండెలో స‌మ‌స్య ఉంద‌ని, బ‌త‌కడం క‌ష్ట‌మ‌ని వైద్యులు చెప్పారు. దాంతో దంప‌తులు త‌మ పాప‌ను అపోలో ఆసుప‌త్రిలో చేర్పించారు. 

కానీ, అక్క‌డ ల‌క్ష‌ల్లో వెచ్చించే ఆర్థికస్థితి ఆ తండ్రికి లేక‌పోవ‌డంతో స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. ఈ స‌మాచారం చ‌ర‌ణ్‌కు తెలియ‌డంతో చిన్నారికి 53 రోజుల పాటు చికిత్స అందించేందుకు సాయం చేశారు. ఇక చికిత్సలో భాగంగా ప్లేట్‌లెట్లు, ర‌క్తం వంటివి చిరంజీవి బ్లడ్ బ్యాంకు నుంచి అందించారు. 

స‌మ‌యానికి వైద్యం అందడం, పాప కోలుకోవ‌డంతో బుధ‌వారం డిశ్చార్జి చేశారు. ఈ విష‌యం మెగా అభిమానుల‌కు తెలియ‌డంతో రామ్‌చ‌ర‌ణ్ రియ‌ల్ హీరో అంటూ సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్టు పెడుతున్నారు. 


More Telugu News