తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం... కారు కాల్వలో పడి ఏడుగురి మృతి
- మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు బాలికలు
- మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలో విషాదం
- కారు కాల్వలో పడటంతో నీళ్లలో మునిగి మృతి
తెలంగాణలోని మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు అదుపు తప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మృతి చెందినవారిలో నలుగురు మహిళలు, ఇద్దరు బాలికలు, ఓ పురుషుడు ఉన్నారు. మెదక్ జిల్లాలోని శివ్వంపేట మండలం ఉసిరికపల్లి వద్ద ఈరోజు సాయంత్రం ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
మృతులను పాముబండ తండాకు చెందిన వారిగా గుర్తించారు. రోడ్డుపై గుంతలు ఉండటంతో వేగంగా వెళుతున్న కారు కల్వర్టును ఢీకొట్టింది. కారు ఎగిరి పక్కనే ఉన్న కాల్వలో పడింది. దాంతో కారులో ఉన్న వారు నీట మునిగి చనిపోయారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. కారు నడుపుతున్న వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు.
సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి
మెదక్ జిల్లా రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులతో మాట్లాడి ప్రమాదం వివరాలు తెలుసుకున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి చెందడం బాధాకరమన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలని, అవసరమైన సాయం అందించాలని ఆదేశించారు.