వచ్చే క్యాబినెట్ సమావేశం లోపు ఇసుక సమస్య పరిష్కారం కావాలి: సీఎం చంద్రబాబు
- ఇసుక అంశంలో మంత్రులు, ఎమెల్యేలు జోక్యం చేసుకుంటున్నట్టు ఆరోపణలు
- నేటి క్యాబినెట్ సమావేశంలో ఇసుక అంశంపై చంద్రబాబు సీరియస్!
- ఇసుక, మద్యం అమ్మకాల్లో ఎవరూ జోక్యం చేసుకోవద్దని స్పష్టీకరణ
సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు ఏపీ క్యాబినెట్ సమావేశం జరిగింది. కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు ఇసుక అంశంలో జోక్యం చేసుకుంటున్నారన్న ఆరోపణలపై చంద్రబాబు తీవ్రస్థాయిలో స్పందించారు. ఉచిత ఇసుక విధానం, మద్యం అమ్మకాల్లో ఎవరూ జోక్యం చేసుకోవద్దని తేల్చి చెప్పారు.
ప్రభుత్వం ఉచితంగానే ఇసుక పంపిణీ చేస్తోందని, అయినప్పటికీ ఇసుక పొందడానికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇసుక విషయంలో రవాణా చార్జీలు మినహా మరే ఇతర రుసుములు ఉండకూడదని స్పష్టం చేశారు. వచ్చే క్యాబినెట్ సమావేశంలోపు ఇసుక సమస్య పరిష్కారం కావాలని పేర్కొన్నారు.
కొందరు దళారుల వల్ల ప్రజలకు ఇసుక భారంగా మారుతోందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఉచిత ఇసుక విధానం పక్కాగా అమలు జరిగేలా చూడాలని మంత్రివర్గానికి స్పష్టం చేశారు.