కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌కు తప్పిన ప్రమాదం... హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్

  • ప్రతికూల వాతావరణం కారణంగా హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
  • ఉత్తరాఖండ్ అదనపు సీఈవోతో కలిసి ప్రయాణిస్తున్న సీఈసీ
  • ఉత్తరాఖండ్‌లోని ఫిథోర్‌గఢ్‌లో ఘటన
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్‌కు త్రుటిలో ప్రమాదం తప్పింది. ప్రతికూల వాతావరణం కారణంగా రాజీవ్ కుమార్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఉత్తరాఖండ్ అదనపు సీఈవోతో కలిసి ఆయన ఆ రాష్ట్రంలోని మున్సియారి ప్రాంతానికి వెళుతుండగా ఫిథోర్‌గఢ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. హెలికాప్టర్‌ను సురక్షితంగా ల్యాండింగ్ చేయడంతో అందులోని వారంతా సురక్షితంగా బయటపడినట్టు ఉత్తరాఖండ్ ప్రభుత్వం తెలిపింది.

వారు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఇక్కడి పర్వత ప్రాంతాల మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. అప్రమత్తమైన పైలట్ అత్యవసర ల్యాండింగ్ చేసినట్లు అధికారులు తెలిపారు. వాతావరణ పరిస్థితులు చక్కబడ్డాక అధికారులు తిరిగి ప్రయాణం కొనసాగిస్తారని వెల్లడించారు.


More Telugu News