బెంగళూరు టెస్టు... తొలి రోజు ఆట వర్షార్పణం
- చిన్నస్వామి స్టేడియం వేదికగా భారత్, కివీస్ టెస్ట్ మ్యాచ్
- వర్షం కారణంగా తొలి రోజు టాస్ కూడా పడని వైనం
- రెండో రోజు వరుణుడు కరుణిస్తే మ్యాచ్ జరిగే అవకాశం
న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఈ రోజు నుంచి ప్రారంభం కావాల్సిన తొలి టెస్టు వర్షం కారణంగా ఆగిపోయింది. తొలి రోజు టాస్ కూడా పడలేదు. తొలి రోజు ఆట మొత్తం వర్షార్పణం అయింది. మధ్యలో కొద్దిసేపు వర్షం ఆగిపోయింది. కానీ, ఆ తర్వాత మళ్లీ వర్షం ప్రారంభమైంది. దాంతో వర్షం తగ్గకపోవడంతో తొలి రోజు ఆటను టాస్ కూడా వేయకుండానే ముగించారు.
రెండో రోజు వరణుడు కరుణిస్తే మ్యాచ్ జరిగే అవకాశం ఉంది. కాగా, గత రెండు రోజులుగా బెంగళూరులో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. దాంతో తొలి టెస్టుపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఇక ఇప్పటికే వాతావరణ శాఖ కూడా మ్యాచ్ జరిగే ఐదు రోజుల పాటు వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది.