రెండోసారి... రేపు హర్యానా సీఎంగా నాయబ్ సైని ప్రమాణ స్వీకారం
- సైనిని శాసన సభాపక్ష నేతగా ఎన్నుకున్న బీజేపీ శాసన సభాపక్షం
- సైనికి శుభాకాంక్షలు తెలిపిన అమిత్ షా
- రేపు ప్రమాణ స్వీకారానికి హాజరుకానున్న ప్రధాని మోదీ
హర్యానా ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ సైనికి బీజేపీ మరోసారి అవకాశం ఇచ్చింది. ఈరోజు జరిగిన శాసనసభా పక్ష సమావేశంలో సైనిని శాసన సభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. మాజీ సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, పార్టీ సీనియర్ నేత అనిల్ విజ్ ఆయన పేరును ప్రతిపాదించగా సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు.
నాయబ్ సింగ్ సైని రేపు హర్యానా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ పరిశీలకులుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ హాజరయ్యారు. సైనికి వారు శుభాకాంక్షలు తెలిపారు.
రేపటి ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. 90 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న హర్యానాలో బీజేపీ 48 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్ 37 సీట్లలో గెలిచింది.