ఓటీటీకి లైన్ క్లియర్ .. దీపావళి రోజున దిగుతున్న 'తంగలాన్'

  • ఆగస్టు 15న విడుదలైన 'తంగలాన్'
  • డిఫరెంట్ లుక్ తో ఆశ్చర్యపరిచిన విక్రమ్ 
  • ముఖ్య పాత్రల్లో   పార్వతి తిరువోతు .. మాళవిక మోహనన్
  • కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో సాగే కథ
  • ఈ నెల 31 నుంచి స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్  


విక్రమ్ కథానాయకుడిగా 'తంగలాన్' రూపొందింది. స్టూడియో గ్రీన్ వారు నిర్మించిన ఈ సినిమాకి, పా. రంజిత్ దర్శకత్వం వహించాడు. పార్వతి తిరువోతు .. మాళవిక మోహనన్ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమాకి, జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని సమకూర్చాడు. ఆగస్టు 15వ తేదీన ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేశారు. 

విక్రమ్ ఫస్టు లుక్ తోనే అంచనాలు పెంచడం మొదలుపెట్టిన ఈ సినిమా, రికార్డుస్థాయి వసూళ్లను రాబడుతుందని అంతా అనుకున్నారు. కానీ ఆ స్థాయి గ్రాఫ్ ను ఈ సినిమా చూపించలేపోయింది. అలాంటి ఈ సినిమా నెలతిరగ్గానే ఓటీటీకి వచ్చేస్తుందని చాలామంది భావించారు. కానీ అలా జరగలేదు. కొన్ని కారణాల వలన ఈ సినిమా ఓటీటీ రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు ఆ అడ్డంకులన్నీ తొలగిపోయాయి. ఈ సినిమాను నెట్ ఫ్లిక్స్ వారు దీపావళి కానుకగా ఈ నెల 31వ తేదీన స్ట్రీమింగ్ చేయనున్నట్టు తెలుస్తోంది. 

ఆంగ్లేయుల కారణంగా తంగలాన్ తన భూమిని కోల్పోవలసి వస్తుంది. ఎలా బ్రతకాలో తెలియని అయోమయంలో పడతాడతను. అప్పుడు కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కి సంబంధించిన పనిని తంగలాన్ తెగకి ఆంగ్లేయులు అప్పగిస్తారు. అయితే ఆ బంగారు గనులు దక్కాలంటే, వాటికి కాపలాగా ఉన్న 'ఆరతి'ని ఎదిరించవలసి ఉంటుంది. ఆరతి ఎవరు? ఆ బంగారు గనులతో ఆమెకి గల సంబంధం ఏమిటి? అనేది కథ. 



More Telugu News