ప్రధాని మోదీకి ఇచ్చిన హామీ నెరవేర్చారు సరే.. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల మాటేంటి?: వైఎస్ షర్మిల
- రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంపై షర్మిల మరోసారి విమర్శలు
- 'ఎక్స్' వేదికగా మంత్రి లోకేశ్‌పై కౌంటర్
- సూపర్ సిక్స్ హామీల విషయమై ప్రభుత్వాన్ని నిలదీత
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంపై మరోసారి విమర్శలు గుప్పించారు. సూపర్ సిక్స్ హామీల విషయమై ప్రభుత్వాన్ని నిలదీశారు. 22 లోక్‌సభ సీట్లకు గాను 21 సీట్లు గెలిచి ప్రధాని మోదీకి ఇచ్చిన హామీని నెరవేర్చినందుకు గర్వంగా ఉందన్న మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యలకు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా షర్మిల కౌంటర్ వేశారు.
ప్రధాని మోదీ హామీ నెరవేర్చామన్న మీరు ఏపీ ప్రజలకు నెరవేర్చని హామీల గురించి ఎందుకు మాట్లాడటం లేదని ఆమె ప్రశ్నించారు. ఫ్రాంక్లీ స్పీకింగ్ టీవీ షోలో మిమ్మల్ని చూడడం చాలా బాగుందని, కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు మీరు ఇచ్చిన హామీలపై మీ ఉద్దేశం ఏంటో స్పష్టంగా చెప్పాలని అడిగారు.
కూటమి ప్రభుత్వం ఏర్పాటై 4 నెలలు గడుస్తున్నా.. ఇప్పటికీ మీ సూపర్ సిక్స్ హామీలు నెరవేరలేదని షర్మిల దుయ్యబట్టారు. ఇక సీఎం చంద్రబాబు ప్రతివారం దేశ రాజధాని ఢిల్లీకి పరుగులు పెడుతున్నప్పటికీ ఒరిగిందేమీ లేదని ఎద్దేవా చేశారు.
రాష్ట్రానికి ప్రధాని ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా నెరవేరలేదని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లకు దిక్కులేకుండా పోయిందన్నారు. వాటి పురోగతి పనులపై మంత్రి లోకేశ్ స్పష్టంగా మాట్లాడితే బాగుంటుందని షర్మిల అన్నారు.