'జబర్దస్త్' నేను మానుకోలేదు .. వాళ్లు మానేయమన్నారు: చలాకీ చంటి
- తనకి ఇగో ఎక్కువని ప్రచారం చేశారన్న చంటి
- సమయం చూసి వెన్నుపోటు పొడిచారని వెల్లడి
- ప్రచారం వలన చాలా నష్టపోయానని ఆవేదన
- బిగ్ బాస్ వలన ఏమీ ఒరగలేదని అసహనం
'జబర్దస్త్' కామెడీ షో కారణంగా చాలామంది కమెడియన్లు మంచి పేరు సంపాదించుకున్నారు. అలాంటివారిలో చలాకీ చంటి ఒకరు. ఆరేళ్లపాటు ఆయన 'జబర్దస్త్' స్టేజ్ పై సందడి చేశాడు. ఈ మధ్య మాత్రం ఆయన 'జబర్దస్త్' లో కనిపించడం లేదు. ఇదే విషయాన్ని గురించిన ప్రశ్న ఆయనకి 'ఐ డ్రీమ్' ఇంటర్వ్యూలో ఎదురైంది. అందుకు ఆయన తనదైన స్టైల్లో స్పందించాడు.
'జబర్దస్త్' నేను మానేయలేదు .. వాళ్లే మానేయమన్నారు. ఎందుకని అడిగే అలవాటు నాకు లేదు. వాళ్లు వద్దన్నారు .. నేను మానేశాను అంతే. అందుకు కారణం ఇగో అనుకోని .. పొగరు అనుకోని .. ఎవరికి తోచింది వాళ్లు చెప్పుకోని. నేను మాత్రం ఆత్మాభిమానం అనే చెప్పుకుంటాను. నాకు ఇగో ఎక్కువని పదేళ్లుగా ప్రచారం చేస్తూనే ఉన్నారు. అసలు ఈ భూమి మీద ఇగోలేని జీవరాశి ఉందా? అనేది ఎవరికి వారు వేసుకోవలసిన ప్రశ్న" అని అన్నాడు.
" నేను ఎంకరేజ్ చేసినవారికి నాకంటే నాలుగు 'చప్పట్లు' ఎక్కువ పడితే నేను సంతోషించాను. కానీ అవతలివారు నాకంటే గొప్ప అనుకున్నారు. సమయం కోసం ఎదురుచూశారు .. పొడిచారు. మోసం చేయడం వాళ్ల తప్పుకాదు ... మోసపోవడం నా తప్పు. 'బిగ్ బాస్'కి వెళ్లడం వలన నా కెరియర్ కి రూపాయి ఉపయోగం లేదు. ఇక ఇంతకు మించి నేనేం మాట్లాడలేను .. ఆ విషయం వదిలేద్దాం" అని అన్నాడు.