భారత్-న్యూజిలాండ్ సిరీస్ లో విజేత ఎవరో చెప్పిన ఆసీస్ మాజీ స్పిన్నర్
- కివీస్‌తో జరగనున్న మూడు టెస్ట్ మ్యాచ్‌ల్లో టీమిండియా గెలుస్తుందని పేర్కొన్న బ్రాడ్ హాగ్
- శ్రీలంక స్పిన్నర్ లను ఎదుర్కోలేక న్యూజిలాండ్ ఇటీవల టెస్ట్ సిరీస్ కోల్పోయిందని వ్యాఖ్య
- కోచ్ గంభీర్ నేతృత్వంలో టీమిండియా టీ 20ల్లో అద్భుత ప్రతిభను కనబరుస్తోందని కితాబు
కివీస్‌తో జరగనున్న మూడు టెస్ట్ మ్యాచ్‌ల్లో టీమిండియా విజయం సాధిస్తుందని ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. బెంగళూరు వేదికగా ఈరోజు భారత్ – న్యూజిలాండ్ మద్య తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో బ్రాడ్ హాగ్ మీడియాతో మాట్లాడాడు. శ్రీలంక స్పిన్నర్‌లను ఎదుర్కోలేక న్యూజిలాండ్ ఇటీవల టెస్ట్ సిరీస్ కోల్పోయిందన్నాడు.
భారత్‌తో జరుగుతున్న సిరీస్‌లో ఆ లోపాలను సరిదిద్దుకుంటారని తాను భావించడం లేదని బ్రాడ్ హాగ్ అన్నారు. ఈ క్రమంలో టెస్ట్ సిరీస్‌ని భారత్ సునాయాసంగా చేజిక్కించుకోనుందని పేర్కొన్నాడు. న్యూజిలాండ్ పేసర్ విలియం ఓరూర్కే వెంట వెంటనే బాల్స్ వేస్తాడు కానీ, ఒక పేస్‌తో బౌలింగ్ చేయడానికి ప్రయత్నించడని అభిప్రాయం వ్యక్తం చేశాడు. భారత జట్టు ప్రధాన కోచ్ గంభీర్ నేతృత్వంలో టీమిండియా టీ 20ల్లో అద్భుత ప్రతిభను కనబరుస్తోందని కితాబు నిచ్చాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ టీమ్ ను సమర్ధవంతంగా నడిపిస్తున్నాడని బ్రాడ్ హాగ్ పేర్కొన్నాడు.
మరోపక్క భారత్ లో న్యూజిలాండ్‌కు చెత్త రికార్డు ఉంది. ఇంతకు ముందు ఆడిన 36 టెస్టు మ్యాచ్‌ల్లో కేవలం రెండు విజయాలు మాత్రమే కివీస్ నమోదు చేసుకుంది.