నైరుతి రుతుపవనాల నిష్క్రమణ .. ఈశాన్య రుతుపవనాల ఆరంభం
- ఈసారి ముందుగానే దేశంలోకి ఈశాన్య రుతుపవనాలు
- తమిళనాడు, పుదుచ్చేరి మీదుగా రాక
- తమిళనాడు, కేరళలో రెడ్ అలెర్ట్
నైరుతి రుతుపవనాలు దేశం నుంచి పూర్తిగా నిష్క్రమించినట్టు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. అదే సమయంలో దేశంలోకి ఈశాన్య రుతుపవనాలు ముందుగానే ప్రవేశించినట్టు పేర్కొంది. నైరుతి బంగాళాఖాతంలోని మధ్య ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడింది. వచ్చే 24 గంటల్లో ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి మరింత బలపడే అవకాశం ఉందని పేర్కొంది.
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దక్షిణాంధ్ర తీరంలో తుపాను ఏర్పడే అవకాశం ఉందని, మధ్య పశ్చిమ అరేబియా సముద్రంపై ఏర్పడిన అల్పపీడనం వచ్చే ఆరు గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఫలితంగా వచ్చే వారం రోజుల్లో కేరళలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో తిరువనంతపురం, కొల్లాం జిల్లా తీర ప్రాంతాల్లో అధికారులు రెడ్ అలెర్ట్ జారీచేశారు.
తమిళనాడుకు ఈశాన్య రుతుపవనాలు
ఈశాన్య రుతుపవనాలు నిన్న తమిళనాడు, పుదుచ్చేరి మీదుగా ప్రారంభమయ్యాయి. ఫలితంగా చెన్నై, దానిని ఆనుకుని ఉన్న జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. నేడు కూడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో రెడ్ అలెర్ట్ ప్రకటించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం చెన్నైకి 490 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. రేపు తెల్లవారుజామున ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలను దాటి పుదుచ్చేరి-నెల్లూరు మధ్య చెన్నైకి దగ్గరగా తీరం దాటే అవకాశం ఉంది.