తెలంగాణ బీజేపీ నేతకు జాతీయ స్థాయిలో కీలక పదవి
- పార్టీ జాతీయ రిటర్నింగ్ అధికారిగా లక్ష్మణ్ నియామకం
- కో రిటర్నింగ్ అధికారులుగా రేఖావర్మ, సంబిత్ పాత్ర, నరేశ్ బన్సల్
- మరికొన్ని రోజుల్లో బీజేపీ సంస్థాగత ఎన్నికలు
తెలంగాణ బీజేపీ నేత డాక్టర్ కే లక్ష్మణ్‌కు ఆ పార్టీ జాతీయస్థాయిలో కీలక పదవిని ఇచ్చింది. బీజేపీ జాతీయ రిటర్నింగ్ అధికారిగా ఆయనను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మరికొన్నిరోజుల్లో బీజేపీ సంస్థాగత ఎన్నికలు జరగనున్నాయి.
బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక క్రమంలో పార్టీ దేశవ్యాప్త సంస్థాగత ఎన్నికలకు రిటర్నింగ్ అధికారిగా లక్ష్మణ్ ను నియమించడం గమనార్హం. ఈ మేరకు జాతీయ అధ్యక్షుడు నడ్డా ఉత్తర్వులు జారీ చేశారు.
కో రిటర్నింగ్ అధికారులుగా బీజేపీ ఉపాధ్యక్షురాలు రేఖావర్మ, పూరీ లోక్ సభ ఎంపీ సంబిత్ పాత్ర, ఉత్తరాఖండ్‌కు చెందిన రాజ్యసభ ఎంపీ నరేశ్ బన్సల్ ఉన్నారు. వీరి ఆధ్వర్యంలో బీజేపీ సంస్థాగత ఎన్నికలు జరుగుతాయని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.