సినిమా పరిశ్రమలో మార్పు కనిపిస్తోంది: సిటాడెల్ హనీ బన్నీ ట్రైలర్ వేడుకలో సమంత
- సిటాడెల్; హనీ బన్నీ ట్రైలర్ విడుదల
- ఈ సిరీస్ లో నటించిన సమంత
- నవంబరు 7నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్
బాలీవుడ్ కథానాయిక ప్రియాంక చోప్రా, హాలీవుడ్ నటుడు రిచర్డ్ మ్యాడెన్ ప్రధాన పాత్రలో నటించిన హాలీవుడ్ సిరీస్ కు ఇండియన్ వెర్షన్ 'సిటాడెల్: హనీ బన్నీ'. రాజ్ డీకే ద్వయం దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో నవంబరు 7 నుంచి స్ట్రీమింగ్ కానుంది. కాగా ఈ సిరీస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్న సమంత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆమె కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఈ వేడుకలో ఆమె మాట్లాడుతూ "ప్రపంచవ్యాప్తంగా ఉన్న టాలెంటెడ్ పీపుల్‌తో పనిచేసే చాన్స్ ఉన్న సినీ పరిశ్రమలో నేను ఉన్నందుకు ఆనందంగా ఉంది" అని తెలిపారు. అయితే సినీ పరిశ్రమలో మహిళల భవిష్యత్తు ఎలా వుంటుందన్న ప్రశ్నకు సమాధానంగా '' సినీ పరిశ్రమలో ఆడ, మగ తేడా లేకుండా అందరికి సమాన అవకాశాలు రావాలనేది నా కోరిక. ఇప్పటికే ఈ మార్పు నాకు కనిపిస్తోంది. ఇలాంటి గొప్ప పరిశ్రమలో నేను భాగమైనందుకు ఆనందంగా ఉంది అన్నారు.
సిటాడెల్ హైలైట్స్ గురించి చెబుతూ "సాధారణంగా స్పై జానర్ సంబంధించిన వెబ్ సిరీస్‌తో పాటు ఎలాంటి సిరీస్ అయినా ఎప్పుడూ మేల్ డామినేషన్ ఉంటుంది. వారే యాక్షన్ చేస్తుంటారు. డైలాగ్స్ చెబుతారు. దానికి భిన్నంగా ఈ సిరీస్‌లో నేను కొంత మేరకు యాక్షన్ సీక్వెన్స్ లు చేశాను. అవి అందరికి నచ్చుతాయనే అనుకుంటున్నాను" అన్నారు.