అచ్యుతాపురం సెజ్‌లో భారీ పరిశ్రమ మూసివేత .. కార్మికుల ఆందోళన
- అత్యుతాపురం సెజ్‌లో అభిజిత్ ఫెర్రో ఎల్లాయిస్ పరిశ్రమను మూసివేసిన యాజమాన్యం
- సీఐటీయూ నేతల ఆధ్వర్యంలో ఆందోళన చేస్తున్న కార్మికులు
- అంతర్జాతీయంగా ఫెర్రో ఉత్పత్తులకు ధరల పతనంతో కంపెనీ మూసివేత
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో అతి పెద్ద ఫెర్రో పరిశ్రమ మూతపడింది. దీంతో కంపెనీలో పని చేస్తున్న దాదాపు మూడు వేల మంది కార్మికులు రోడ్డున పడ్డారు. కంపెనీ ప్రధాన ద్వారం వద్ద సీఐటీయూ నేతల ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళనకు దిగారు. పెరిగిన విద్యుత్ చార్జీల భారంకు తోడు ఫెర్రో ఉత్పత్తులకు అంతర్జాతీయంగా ధరలు పతనం కావడంతో సెజ్‌లోని అభిజిత్ ఫెర్రో ఎల్లాయిస్ ఫ్యాక్టరీని సోమవారం మూసి వేశారు.
ఫెర్రో కంపెనీలకు పలు రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీపై విద్యుత్ ను అందిస్తుండగా, ఏపీలో ఐదేళ్లుగా రాయితీపై విద్యుత్ సరఫరా చేయకపోగా, విద్యుత్ చార్జీలు పెరగడం కంపెనీకి పెను భారం అయింది. అంతే కాకుండా ఇటీవల కాలంలో అంతర్జాతీయంగా ఫెర్రో ఉత్పత్తుల ధర రూ.1.55 లక్షల నుండి 70వేలకు పడిపోవడంతో ఆర్ధిక నష్టాలతో నడపలేక యాజమాన్యం కంపెనీకి తాళాలు వేసింది. కంపెనీని ఆర్ధాంతరంగా మూసివేయడంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. సీఐటీయూ నేతలు వారికి అండగా నిలిచి నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.