బాబర్ అజామ్ ను తొలగించలేదంటున్న పాక్ అసిస్టెంట్ కోచ్!
- పాక్ మాజీ కెప్టెన్ బాబర్ అజామ్ ను జట్టు నుండి తొలగించడంపై విమర్శలు
- వివరణ ఇచ్చిన పాక్ అసిస్టెంట్ కోచ్ అజార్ మహమూద్
- భవిష్యత్ లో ఉన్న సిరీస్‌లను దృష్టిలో పెట్టుకొని విశ్రాంతి నిచ్చామని అజార్ వెల్లడి
పాకిస్థాన్ మాజీ కెప్టెన్ బాబర్ అజామ్‌ను ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌ల నుండి తొలగించడంపై పీసీబీపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్టులో పాక్ ఇన్నింగ్స్ ఓటమి తర్వాత మిగతా టెస్టుల కోసం ప్రకటించిన పాక్ జట్టులో అతనికి చోటు లభించలేదు. ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో బాబర్ 30, 5 పరుగులే చేశాడు. పాక్ జట్టులో బాబర్‌ను తప్పించడంపై వచ్చిన విమర్శలకు పాక్ అసిస్టెంట్ కోచ్ అజార్ మహమూద్ స్పందిస్తూ వివరణ ఇచ్చారు.
బాబర్ అజామ్‌ను జట్టు నుండి తప్పించలేదని, భవిష్యత్‌లో ఉన్న సిరీస్‌లను దృష్టిలో పెట్టుకొని విశ్రాంతిని మాత్రమే ఇచ్చామని అజార్ మహమూద్ వివరణ నిచ్చారు. బాబర్ అజామ్ నెంబర్ వన్ ఆటగాడని, ఆ విషయంలో ఎలాంటి సందేహం లేదని అన్నారు. టెక్నిక్, సామర్థ్య పరంగా అతను మేలైన ఆటగాడని పేర్కొన్నారు. త్వరలో తమకు ఆస్ట్రేలియా టూర్ ఉందని, ఆ తర్వాత జింబాబ్వే, దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లాల్సి ఉందని, అవి తమకు ముఖ్యమైన సిరీస్ లని అజార్ మహమూద్ తెలిపారు. బాబర్ ఆడటానికి సిద్ధంగా ఉన్నాడని, కానీ అతనికి విశ్రాంతిని ఇవ్వాలని టీమ్ నిర్ణయం తీసుకుందని అజార్ వెల్లడించారు.
మరో పక్క బాబర్ అజామ్‌ను జట్టులోకి తీసుకోకపోవడంపై పాక్ ప్లేయర్ ఫకర్ జమన్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పోస్టు పెట్టారు. స్టార్ ప్లేయర్‌ను పక్కన పెట్టాలన్న నిర్ణయం .. జట్టులో ప్రతికూల సందేశాన్ని పంపుతుందని, మన కీలక ఆటగాళ్లను అణగదొక్కడం కంటే వారిని కాపాడుకోవడంపై దృష్టి పెట్టాలని ఫకర్ జమర్ సూచించారు. దీనిపై వివరణ ఇవ్వాలని పీసీబీ అతడికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది.