భయ్యా అని పిలవొద్దు.. ప్రయాణికులకు క్యాబ్ డ్రైవర్ ఆరు రూల్స్.. నెట్టింట చర్చ!
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న క్యాబ్ డ్రైవర్ రూల్స్
- మర్యాదగా మాట్లాడటం, యాటిట్యూడ్ చూపించకూడదంటూ నిబంధనలు
- క్యాబ్ డ్రైవర్ రూల్స్‌పై తమదైన శైలిలో స్పందిస్తున్న నెటిజన్లు
తన క్యాబ్ ఎక్కే ప్రయాణికులకు ఓ డ్రైవర్ పెట్టిన ఆరు రూల్స్ ఇప్పుడు నెట్టింట చర్చకు దారితీశాయి. డ్రైవింగ్ సీటు వెనుక వైపు చిన్నసైజు బోర్డు రూపంలో ఏర్పాటు చేసిన ఆ రూల్స్ పట్టిక ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. తనతో మర్యాదగా మసలుకోవడంతో పాటు యాటిట్యూడ్ చూపించకూడదని ఇలా ఆరు విషయాలను ప్రస్తావిస్తూ రూల్స్ బోర్డును ఏర్పాటు చేసుకున్నాడు.
ఓ ప్రయాణికుడు ఆ క్యాబ్ ఎక్కిన సందర్భంలో తన కంటబడ్డ ఆ రూల్స్ బోర్డును ఫొటో తీసి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ రెడిట్‌లో పోస్ట్ చేశాడు. దాంతో అది కాస్తా వైరల్‌గా మారడంతో నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
క్యాబ్ డ్రైవర్ పెట్టిన ఆ ఆరు రూల్స్ ఏంటంటే..
1. మీరు ఈ క్యాబ్‌కు యజమాని కాదు.
2. డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తే ఈ క్యాబ్‌కు ఓనర్
3. మంచిగా మాట్లాడి మర్యాదకరంగా మసలుకోవాలి
4. డోర్ స్లోగా వేయాలి
5. ఎట్టిపరిస్థితుల్లో యాటిట్యూడ్ చూపించకూడదు. దాన్ని మీ జేబులో మడిచిపెట్టుకోండి. ఎందుకంటే మీరు మాకు ఎక్కువ డబ్బులేమీ ఇవ్వడం లేదు.
6. నన్ను భయ్యా (బ్రదర్) అని మాత్రం పిలవకూడదు.
ఇలా ఆరు రూల్స్‌తో సదరు క్యాబ్ డ్రైవర్ ఒక బోర్డును డ్రైవింగ్ సీటు వెనుకవైపు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ బోర్డులో చివరగా సమయానికి గమ్యస్థానానికి వెళ్లాలి, స్పీడ్‌గా డ్రైవ్ చేయమని కూడా అడగొద్దని రాసుకొచ్చాడు.
దీనిపై నెటిజన్లు కొందరు డ్రైవర్‌కు మద్దతు తెలుపుతుంటే మరికొందరు మాత్రం ఇదేంటి? అంటూ విమర్శిస్తున్నారు. "అన్నీ బాగానే ఉన్నా.. బ్రదర్ అని పిలవకూడదని చెప్పడం ఏంటి?" అని ఒకరు కామెంట్ చేశారు.
"అతను వందకు వందశాతం కరెక్ట్. అతని గైడ్‌లైన్స్ లో కూడా ఎలాంటి తప్పులేదు. మన దగ్గర చాలామంది క్యాబ్ డ్రైవర్లు అంటే చిన్నచూపు చూస్తారు. అందుకే ఇలాంటివి ఉంటేనే మంచిది" అని మరొకరు కామెంట్ చేశారు.
"ఇలాంటివి బాగానే చెబుతారు. కానీ క్యాబ్ మాత్రం శుభ్రంగా ఉండదు. పనిచేయని ఏసీలు, రైడ్‌లలో ఆలస్యం ఇలా ఎన్నో తిప్పలు ఉంటాయి. చార్జీలు మాత్రం బాగానే వసూలు చేస్తారు" అని ఇంకొకరు కామెంట్ చేశారు. ఇలా ఇప్పుడీ పోస్టు నెట్టింట తీవ్ర చర్చకు దారితీసింది.