మీరు తెచ్చిన లిక్కర్ పాలసీ గొప్పది అయితే బెదిరింపులు ఎందుకు?: జగన్
- ఏపీలో నూతన మద్యం విధానం
- నేడు లాటరీ ద్వారా దుకాణాల కేటాయింపు
- భారీ ట్వీట్ చేసిన జగన్
లిక్కర్ మాఫియాకు, సిండికేట్లకు ఏపీ అడ్డాగా మారిపోయిందని వైసీపీ అధినేత జగన్ ధ్వజమెత్తారు. ఇవాళ ఏపీలో మద్యం దుకాణాలకు లాటరీ ప్రక్రియ నిర్వహించిన నేపథ్యంలో, జగన్ భారీ ట్వీట్ చేశారు. లిక్కర్ మాఫియాకు చంద్రబాబే సూత్రధారి, పాత్రధారి అని ఆరోపించారు.
ప్రభుత్వ మద్యం దుకాణాలను మూసివేసి, ప్రైవేటు వారికి, మీ వారికి అప్పగించాలన్న నిర్ణయం అవినీతి కోసం మీరు వేసిన స్కెచ్ కాదా? అని ప్రశ్నించారు. మీరు తెచ్చిన లిక్కర్ పాలసీ గొప్పదే అయితే రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు మీ కనుసన్నల్లో ఎందుకు బెదిరింపులకు దిగారు? అంటూ జగన్ నిలదీశారు.
"నీకింత, నాకింత అని కమీషన్లలో వాటాలు వేసుకున్నది నిజం కాదా? ఇష్టం వచ్చిన రేట్లకు అమ్ముకోండి అంటూ సిండికేట్లకు ఓకే చెప్పినట్టే కదా! ఇన్ని అరాచకాలకు పాల్పడిన మీరు... నిర్ణయించిన ధరకే మద్యం విక్రయాలు సాగించడం నిజమేనా? ప్రజలను మభ్యపెట్టడానికి చీప్ లిక్కర్ రేట్లు తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. అందుకోసం నాణ్యతను తగ్గించి, మరోవైపు అమ్మకాలు పెంచి, తద్వారా డిస్టిలరీల నుంచి లంచాల ఆదాయం పెంచుకునే కార్యక్రమం చేస్తున్నారు.
ప్రభుత్వ దుకాణాల ద్వారా మద్యం అమ్మితే అమ్మకాలపై ప్రభుత్వ నియంత్రణ ఉంఉటంది. మద్యం నియంత్రణ అనే ప్రాథమిక బాధ్యత దిశగా ప్రభుత్వాలు కాస్తయినా పనిచేసినట్టు ఉంటుంది. పక్కా లిక్కర్ వ్యాపారిలా ఆలోచిస్తున్నారు తప్ప, రాష్ట్రానికి తండ్రిస్థానంలో ఉన్న ముఖ్యమంత్రిలా ఎందుకు ఆలోచన చేయడంలేదు?
గతంలో లాభాపేక్ష లేనందున బెల్టు షాపులు, పర్మిట్ రూమ్స్ రద్దయ్యాయి. కానీ ఇప్పుడా పద్ధతి ఎత్తివేసి దుకాణాల సంఖ్యను పెంచేసి, మొత్తం మీవాళ్లకు అప్పగించేశారు. వీళ్లు ఏర్పాటు చేసే పర్మిట్ రూములు, బెల్టు షాపులకు లెక్కే లేదు.
లక్ష్యల సంఖ్యలో ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పే మీరు, ఇప్పుడు మీ స్వార్థం కారణంగా ప్రభుత్వ లిక్కర్ షాపుల్లో పనిచేసే 15 వేల మందిని రోడ్డున పడేశారు.
చంద్రబాబు గారూ... మీ అక్రమార్జన కోసం, మీ వాళ్లకు అవినీతి డబ్బును సంపాదించడం కోసం మీరు తీసుకువస్తున్న మద్యం విధానం ప్రమాదకరం. అవినీతి ధ్యేయంగా అమలు చేస్తున్న ఈ లిక్కర్ పాలసీతో రాష్ట్రం మరింత వెనక్కి వెళుతుంది. మీ చర్యలను సరిదిద్దుకోకపోతే ప్రజల తరపున ఉద్యమిస్తాం" అని జగన్ స్పష్టం చేశారు.