ఈ నెల 22, 23 తేదీల్లో అమరావతి డ్రోన్ సమ్మిట్
- మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్లో రెండ్రోజుల పాటు డ్రోన్ సమ్మిట్
- ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
- ఏపీ డ్రోన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జాతీయస్థాయి సదస్సు
- భాగస్వామిగా డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా
ఈ నెల 22, 23 తేదీల్లో అమరావతి డ్రోన్ సమ్మిట్ నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్ లో ఈ జాతీయ స్థాయి సదస్సును రెండ్రోజుల పాటు నిర్వహించనున్నారు. ఈ దిశగా ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి.
ఈ జాతీయ సెమినార్ నిర్వహణను ఏపీ డ్రోన్ కార్పొరేషన్ నిర్వహిస్తుండగా.... భాగస్వామిగా డ్రోన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వ్యవహరించనుంది.
వ్యవసాయం, వైద్య, ఆరోగ్య, పట్టణ ప్రణాళిక, శాంతిభద్రతలు, వస్తు ఉత్పత్తి అంశాల్లో డ్రోన్ల వినియోగం, అందుకు తగిన విధాన రూపకల్పనపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చించనున్నారు. వాణిజ్యపరంగానూ డ్రోన్ల వినియోగాన్ని పెంచడం, డ్రోన్ సిటీ ఏర్పాటుకు సంబంధించిన రోడ్ మ్యాప్ రూపకల్పనపై ఈ సదస్సులో దృష్టి సారించనున్నారు.