ఫాక్స్‌కాన్ కంపెనీని సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి
- కొంగరకలాన్‌లోని ఫాక్స్‌కాన్ కార్యాలయానికి వెళ్లిన సీఎం, మంత్రి శ్రీధర్ బాబు
- సంస్థ చైర్మన్ యాంగ్ లియూతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన సీఎం
- మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫాక్స్‌కాన్ సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యారు. రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లోని ఫాక్స్‌కాన్ కార్యాలయానికి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు వెళ్లారు. ఈ సందర్భంగా సంస్థ చైర్మన్ యాంగ్ లియూతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
కంపెనీకి కావాల్సిన మౌలిక సదుపాయాలను కల్పిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో మరిన్ని విభాగాల్లో పెట్టుబడులకు ముందుకు రావాలని కోరారు. ఎలక్ట్రిక్, లిథియం బ్యాటరీ విభాగాల్లోనూ పెట్టుబడులు పెట్టాలన్నారు. ఈ సందర్భంగా కంపెనీ ప్రతినిధులను... సంస్థ పురోగతి, ఇతర అంశాలపై అడిగి తెలుసుకున్నారు.
ఢిల్లీకి రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 17న ఢిల్లీకి వెళ్లనున్నారు. 17న ఢిల్లీలో సీడబ్ల్యుసీ వర్కింగ్ కమిటీ సమావేశం ఉంది. ఈ సమావేశానికి రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఆయనతో పాటు తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి దామోదర రాజనర్సింహ, పార్టీ నేత వంశీచంద్ రెడ్డి తదితరులు హాజరు కానున్నారు.