తిరుమల కొండపై ఎడతెరిపి లేకుండా వాన

  • బంగాళాఖాతంలో అల్పపీడనం
  • ఏపీ దక్షిణ కోస్తాలో జోరుగా వానలు
  • వేకువజామున 4 గంటల నుంచి తిరుమలలో భారీ వర్షం
దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో ఈ వేకువజాము నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలోనూ తెల్లవారుజాము 4 గంట నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. తిరుమాడ వీధుల్లో నీళ్లు ప్రవహిస్తున్నాయి.

తిరుమలలో భారీ వర్షం కారణంగా భక్తులు ఇబ్బందులకు గురయ్యారు. దీనిపై టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్పందించారు. భక్తులు వర్షంలో ఉండొద్దని, షెడ్లు ఖాళీ అయిన వెంటనే లోపలికి పంపిస్తామని చెప్పారు.


More Telugu News