భూమి మీద నూకలు ఉండటమంటే ఇదేనేమో... షాకింగ్ వీడియో వైరల్

 
భూమి మీద నూక‌లుంటే ఎంత పెద్ద ప్ర‌మాద‌మైనా ఏం చేయ‌లేదు అన‌డానికి ఇది చ‌క్క‌టి ఉదాహ‌ర‌ణ‌! ఈ ఘ‌ట‌న తాలూకు వీడియో ఒక‌టి ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

ఎత్తైన భ‌వ‌నంపై ఉన్న వాట‌ర్ ట్యాంకును మారుస్తుండ‌గా ఒక్క‌సారిగా అది కింద ఉన్న మ‌హిళ‌పై ప‌డ‌టం, ఆమెకు చిన్న గాయం కూడా కాక‌పోవ‌డం వీడియోలో మ‌నం చూడొచ్చు. ఓ మ‌హిళ ఏదో తింటూ రోడ్డు దాటుతుండ‌గా ఆమెపై ఇలా పైనుంచి పెద్ద వాట‌ర్ ట్యాంక్ ప‌డినా ఎలాంటి గాయం కాలేదు. ట్యాంక్ పైభాగం నుంచి ఆమె పైకి లేచి ఏం జ‌ర‌గ‌న‌ట్లు తింటూ ఉండ‌టం వీడియోలో ఉంది.

ఇది చూసిన నెటిజ‌న్లు షాక్ అవుతున్నారు. అయితే, ఈ ఘ‌ట‌న ఎక్క‌డ జ‌రిగిందో తెలియ‌రాలేదు. ప్ర‌స్తుతం ఈ ఘ‌ట‌న తాలూకు వీడియో మాత్రం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.


More Telugu News