16 రోజుల దేవర వసూళ్లను అధికారికంగా ప్రకటించిన మేకర్స్
- 16 రోజుల్లో 509 కోట్లు కలెక్ట్ చేసినట్లుగా అఫీషియల్ ప్రకటన
- బాక్సాఫీస్ కలెక్షన్లతో పోస్టర్ విడుదల
- ఆనందంలో ఎన్టీఆర్ అభిమానులు
ఎన్టీఆర్, కొరటాల శివ కలయికలో రూపొందిన చిత్రం 'దేవర'. జనతా గ్యారేజ్ వంటి బ్లాక్‌బస్టర్ విజయం తరువాత ఈ క్రేజీ కాంబినేషన్ దేవర కోసం మరోసారి జతకట్టారు. ప్రముఖ కథానాయిక స్వర్గీయ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ఈ చిత్రం ద్వారానే టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకొచ్చిన దేవర ప్రేక్షకుల ఆదరణతో విజయవంతంగా దూసుకుపోతోంది.
మంచి వసూళ్లతో ప్రారంభమైన ఈ చిత్రం ఇప్పటికీ షేర్‌లు రాబడుతూ వసూళ్ల విషయంలో సంతృప్తికరంగానే వుంది. ఈ చిత్రం బాక్సాఫీస్ వసూళ్లకు దసరా సెలవులు అడ్వాంటేజీగా నిలిచాయి. ఇక ఈ చిత్రంలో దేవర, వర అనే రెండు పాత్రల్లో ద్విపాత్రాభినయంలో నటించిన ఎన్టీఆర్ నటనకు ఆయన అభిమానులు, ప్రేక్షకులు ఫిదా అయిపోయారు.
అయితే ఈ చిత్రం విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 16 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 509 కోట్ల రూపాయల గ్రాస్‌ను కలెక్ట్ చేసినట్లుగా అఫీషియల్‌గా ఓ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఆచార్యతో అపజయాన్నిచూసిన కొరటాల శివకు దేవర మంచి కమ్‌బ్యాక్ ఫిలిమ్ అని చెప్పుకోవాలి. అంతేకాదు ఎన్టీఆర్-కొరటాల శివ జోడి చేసిన రెండు చిత్రాలు విజయవంతం కావడం కూడా ఎన్టీఆర్ అభిమానుల్లో మంచి సంతోషాన్ని నింపింది.
.