ఏపీలో వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం: విపత్తు నిర్వహణ సంస్థ

  • బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం
  • రాగల 24 గంటల్లో దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం
  • ఏపీలో నాలుగు రోజుల పాటు విస్తారంగా వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం రేపు అల్పపీడనంగా మారనున్న నేపథ్యంలో, ఏపీలో నాలుగు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురవనున్నట్టు ఐఎండీ వెల్లడించింది. దీనిపై ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) స్పందించింది. 

వర్షాలతో పాటు పిడుగులు కూడా పడే అవకాశం ఉందని వెల్లడించింది. వర్షం పడే సమయలో చెట్లు, కరెంటు స్తంభాలు, హోర్డింగ్ ల కింద ఉండరాదని ప్రజలకు సూచించింది. వరదలు వచ్చే అవకాశం ఉన్నందున కాలువలు, కల్వర్టులు, మ్యాన్ హోల్స్ కు దూరంగా ఉండాలని ఏపీఎస్డీఎంఏ పేర్కొంది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని స్పష్టం చేసింది.


More Telugu News