ఎస్సీ వర్గీకరణపై ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కీలక వ్యాఖ్యలు

  • ఇటీవల ఎస్సీ వర్గీకరణపై సుప్రీం కీలక తీర్పు
  • సుప్రీం తీర్పు ఎవరికీ అనుకూలం కాదన్న చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్
  • మున్ముందు రిజర్వేషన్లకే ముప్పు వాటిల్లే అవకాశం ఉందని వెల్లడి
  • మాలలు ఐక్యంగా ఉండాలని పిలుపు
ఎస్సీ వర్గీకరణ అంశంలో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో, ఆ పార్టీ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎస్సీ వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఎవరికీ అనుకూలంగా లేదని అన్నారు. వర్గీకరణపై సుప్రీం వెలువరించిన తీర్పులో అనేక అంశాలు ఉన్నాయని, ఆ తీర్పు పట్ల పలు అభ్యంతరాలు కూడా వ్యక్తమయ్యాయని తెలిపారు. 

మున్ముందు రిజర్వేషన్లకే ముప్పు వాటిల్లే పరిస్థితులు ఉన్నాయని,  మాల సామాజిక వర్గంలో ఉన్న అన్ని సంఘాలు ఐక్యంగా పనిచేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. మాలలు అందరూ కలిసి ఉన్నప్పుడే ఏదైనా సాధించే వీలుంటుందని వివేక్ అభిప్రాయపడ్డారు. 

ఇవాళ ఆదిలాబాద్ లో నిర్వహించిన మాలల ఆత్మీయ సమ్మేళనంలో వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగానే ఆయన పైవ్యాఖ్యలు చేశారు.


More Telugu News