రేపు దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం... ఏపీకి అతి భారీ వర్ష సూచన
- దక్షిణ కోస్తాలో నాలుగురోజుల పాటు విస్తారంగా వర్షాలు
- ఈ నెల 14, 15, 16, 17 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
- రాయలసీమలోనూ అతి భారీ వర్షాలు
ఆగ్నేయ బంగాళాఖాతాన్ని ఆనుకుని హిందూ మహాసముద్రం మీదుగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం పశ్చిమ వాయవ్య దిశగా కదిలి నేడు మరింత విస్తరించింది.
దీని ప్రభావంతో రేపు (అక్టోబరు 14) దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. ఇది క్రమేపీ పశ్చిమ వాయవ్య దిశగా ఏపీ దక్షిణ కోస్తా తీరం వైపు పయనించే అవకాశాలున్నాయని ఐఎండీ పేర్కొంది. దీని ప్రభావంతో విస్తారంగా వర్షాలు పడతాయని తెలిపింది.
ముఖ్యంగా, ఏపీ దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఈ నెల 14, 15, 16, 17 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వివరించింది. ఈ నెల 17న ఉత్తరాంధ్ర, యానాంలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.