ఏపీ సీఎం చంద్రబాబు ట్వీట్‌పై స్పందించిన చిరంజీవి
- వరద బాధితుల సహాయార్థం చెక్కును అందించిన చిరంజీవి
- మానవతాసేవలో చిరంజీవి ముందుంటారన్న చంద్రబాబు
- మీ ఆదరణకు ధన్యవాదాలు అంటూ చిరంజీవి ట్వీట్
భారీ విపత్తు సంభవించిన సమయంలో మా వంతుగా సాయం కర్తవ్యమని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు. మానవసేవలో చిరంజీవి ఎప్పుడూ ముందుంటారని ఏపీ సీఎం చంద్రబాబు చేసిన పోస్ట్‌పై మెగాస్టార్ ఎక్స్ వేదికగా స్పందించారు. "నాపై మీరు చూపిన అభిమానానికి ధన్యవాదాలు... వరదలు వంటి భారీ విపత్తు సంభవించినప్పుడు మన సొంతవారికి సహాయం చేయడం మా కర్తవ్యం. ఇలాంటి పరిస్థితుల్లో మీ నాయకత్వం ఎంతో ఆదర్శనీయం" అని ట్వీట్ చేశారు.
ఏపీలో వరద బాధితుల సహాయార్థం చిరంజీవి, రామ్ చరణ్... చెరో రూ.50 లక్షలు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన చెక్కును చిరంజీవి నిన్న చంద్రబాబును కలిసి అందించారు. ఈ ఫొటోలను చంద్రబాబు షేర్ చేస్తూ... సీఎం సహాయనిధికి చిరంజీవి, రామ్ చరణ్ కలిసి రూ.1 కోటి అందించారని పేర్కొన్నారు. మానవతాసేవలో వారు ఎప్పుడూ ముందుంటారని ప్రశంసించారు. వరదల వల్ల నష్టపోయిన వారి జీవితాలను పునర్నిర్మించేందుకు వారి సహకారం ముఖ్య పాత్రను పోషిస్తుందని పేర్కొన్నారు.