సింగపూర్ సంస్థ లీగల్ నోటీసులపై స్పందించిన బీఆర్ఎస్ నేత క్రిశాంక్
- ఎక్స్ వేదికగా చేసిన పోస్టులను తొలగించే ప్రశ్నే ఉత్పన్నం కాదన్న క్రిశాంక్
- తనకు నోటీసులు రావడంపై కేటీఆర్‌తో చర్చించినట్లు వెల్లడి
- తమ పార్టీ లీగల్ సెల్ నోటీసులకు సమాధానం ఇస్తుందని వెల్లడి
మెయిన్ హార్డ్ సంస్థ తనకు క్రిమినల్ నోటీసులు పంపించడంపై బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ స్పందించారు. ఈ నోటీసుకు సంబంధించిన ట్వీట్‌ను జత చేస్తూ ఆయన ఎక్స్ వేదికగానే స్పందించారు. మూసీ కాంట్రాక్ట్‌పై ఎక్స్ వేదికగా చేసిన తన పోస్టులను తొలగించే ప్రశ్నే ఉత్పన్నం కాదని పేర్కొన్నారు. తనకు నోటీసులు అందిన అంశంపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో చర్చించినట్లు చెప్పారు.
సింగపూర్ సంస్థ ఇచ్చిన నోటీసులకు తమ పార్టీ లీగల్ సెల్ సమాధానం ఇస్తుందన్నారు. రూ. 3 వేల కోట్ల కుంభకోణంలో మెయిన్ హార్డ్ కు పాకిస్థాన్ రెడ్ వారెంట్ నోటీసులు జారీ చేసింది నిజం కాదా? మెయిన్ హార్డ్ ను ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నిషేధించింది నిజం కాదా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మూసీ కాంట్రాక్టర్ సింగపూర్ కంపెనీ నోటీసులకు, పోలీసు కేసులకు భయపడేది లేదన్నారు.
రూ.3 వేల కోట్ల కుంభకోణంలో రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయిన కంపెనీకీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూసీ కాంట్రాక్ట్ ఇచ్చిందని మన్నె క్రిశాంక్ ఎక్స్ వేదికగా బుధవారం పోస్ట్ చేశారు. ఈ ట్వీట్‌పై తీవ్రంగా స్పందించిన సింగపూర్ సంస్థ క్రిశాంక్ కు నోటీసులు పంపించింది.