ఇరాన్ విమానాల్లో పేజర్లు, వాకీటాకీలపై నిషేధం
- లెబనాన్ లో ఇటీవలి పేజర్ పేలుళ్లతో నిర్ణయం
- ప్రయాణికులు పేజర్లను వెంట తెచ్చుకోవద్దని సూచన
- ఇప్పటికే పేజర్లపై బ్యాన్ విధించిన ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్
లెబనాన్ లో ఇటీవల పేజర్లు పేలి విధ్వంసం సృష్టించిన విషయం తెలిసిందే. దాదాపు 300 మందికి పైగా ఈ ఘటనలో ప్రాణాలు పోగొట్టుకోగా మరో మూడువేల మంది తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం వాకీటాకీలు కూడా పేలిపోయి పలువురు మరణించారు. దీంతో అప్రమత్తమైన ఇరాన్ ప్రభుత్వం.. తమ విమానాల్లో పేజర్లు, వాకీటాకీలపై నిషేధం విధించింది. ప్రయాణికులు తమ వెంట పేజర్లు, వాకీటాకీలు తీసుకురావద్దని సూచించింది. చెకిన్ లగేజీలోనూ వాటిని అనుమతించబోమని తేల్చిచెప్పింది.
ఎట్టిపరిస్థితుల్లోనూ పేజర్లు, వాకీటాకీలను విమానాల్లోకి అనుమతించవద్దని అధికారులను ఆదేశించింది. ఈమేరకు ఇరాన్ పౌర విమానయాన సంస్థ శనివారం ఆదేశాలు జారీ చేసింది. మొబైల్ ఫోన్లు మినహా ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలను విమానంలోకి అనుమతించబోమని స్పష్టం చేసింది. కాగా, దుబాయ్ కు చెందిన ఎమిరేట్స్ కంపెనీ ఇప్పటికే తమ విమానాల్లో పేజర్లు, వాకీటాకీలపై నిషేధం విధించింది. లెబనాన్ లో పేజర్లు, వాకీటాకీలు పేలిన ఘటనల వెంటనే ఈ నిర్ణయం తీసుకుంది. దుబాయ్ నుంచి వెళ్లే, దుబాయ్ కి వచ్చే విమానాల్లో ప్రయాణికులు పేజర్లు, వాకీటాకీలు వెంట తీసుకురావడం, క్యాబిన్, చెకిన్ లగేజీలలో వాటిని ఉంచడంపై బ్యాన్ విధించింది.