ఇదొక విచిత్రమైన విమాన సర్వీసు... కేవలం ఒకటిన్నర నిమిషంలో ప్రయాణం పూర్తవుతుంది!

  • వెస్ట్‌రే – పాపా వెస్ట్‌రే మధ్య దూరం 1.7 మైళ్ల దూరానికే విమాన ప్రయాణం
  • వెస్ట్‌రే – పాపా వెస్ట్‌రే మధ్య వంతెన లేకపోవడంతో విమాన ప్రయాణాలు చేస్తున్న ప్రజలు
  • పది మంది మాత్రమే ప్రయాణించే విమాన సర్వీసులు
సాధారణంగా ఎవరైనా విమాన ప్రయాణం అంటే సుదూర ప్రాంతాలకు అనే భావన ఉంటుంది. దూర భారం ప్రయాణాల్లో సమయం కలిసి వస్తుందని ప్రయాణీకులు విమాన ప్రయాణాలు చేస్తుంటారు. అయితే ఇక్కడ చిత్రం ఏమిటంటే .. కేవలం ఒకటిన్నర నిమిషాలలోనే విమాన ప్రయాణం పూర్తి అవ్వడం. అదీ కాకుండా 1.7 మైళ్ల దూరానికే విమానాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఇక్కడ ఉంది. ఓర్క్‌నీ దీవుల్లో వెస్ట్‌రే, పాపా వెస్ట్‌రే ప్రాంతాలకు లోగాన్ ఎయిర్ సంస్థ విమాన సర్వీసులను నడుపుతోంది. 

ఈ దీవుల్లోని రెండు ప్రాంతాల మధ్య వంతెన లేకపోవడంతో విమాన సర్వీసులను అందిస్తున్నారు. వెస్ట్‌రే - పాపా వెస్ట్‌రే మధ్య దూరం 1.7 మైళ్ల దూరం కాగా, ఇది స్కాట్లాండ్ రాజధాని ఎడిన్‌బర్గ్ ఎయిర్ పోర్టులో ఉన్న రన్‌వేతో సమానం. విమానం టేకాఫ్ నుండి ల్యాండింగ్ వరకూ కేవలం ఒకటిన్నర నిమిషాలు మాత్రమే సమయం పడుతుంది. ఇంత తక్కువ ప్రయాణం కోసం ఎయిర్ లైన్స్ సంస్థలు బ్రిట్టెన్ నార్మన్ బీఎన్2బీ - 26 ఐలాండర్ విమానాలను వినియోగిస్తుంటారు. 

ఈ విమానాల్లో కేవలం పది మంది ప్రయాణీకుల సీటింగ్ కెపాసిటీ ఉంటుంది. పైలట్ ఆపరేషన్‌ను ముందు వరుసలో కూర్చునే ప్రయాణీకులు చూడవచ్చు. పాపా వెస్ట్‌రేలో అతి తక్కువ మంది జనాభా మాత్రమే నివసిస్తుంటారు. వీరంతా ప్రధాన భూభాగానికి కనెక్ట్ అయ్యేందుకు ఈ విమానాలపైనే ఆధారపడుతూ ఉంటారు. అయితే గత కొద్ది సంవత్సరాలుగా షార్ట్ జర్నీ అనుభూతిని, ప్రకృతి దృశ్యాలను అస్వాదించాలనుకునే పర్యాటకులు ఈ ప్రాంతాన్ని సందర్శనకు ఎంచుకుంటున్నారు.


More Telugu News